చిత్తూరులో గజరాజుల బీభత్సం.. తిరుపతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Elephants Hulchul in Chittoor Dist ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య రోజు రోజుకు తీవ్రతరం అయ్యింది. రైతులకే కాదు ఏనుగుల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారింది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాదు రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.అడవిని వదిలి గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగు గుంపు పీలేరులో మరో రైతును పొట్టన పెట్టుకుంది. గజరాజులు చిత్తూరు జిల్లా రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఏనుగుల సమస్య రైతాంగానికి అతి పెద్ద సమస్యగా మారింది. పంట పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపెడుతున్నారు. శేషాచలం అడవులు, కౌండిన్య అభయారణ్యంతో పాటు చిత్తూరు జిల్లాకు ఇరువైపులా ఉన్న తమిళనాడు కర్ణాటక అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులు పంట నష్టం, ప్రాణ నష్టాన్ని మిగుల్చుతున్నాయి.…
Read More