లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం తిరుమల, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Tirumala VIP Darsan తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి ఒక్క హిందువుకు ఎంతో ముఖ్యం. పుట్టిన రోజు నాడు అయినా .. జీవితంలో ఏదైనా సాధించిన రోజు అయినా.. దూర ప్రాంతంలో ఉండి సొంత రాష్ట్రానికి వచ్చినా ముందుగా శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు.అందుకే తిరుమల కొండలపై ఎప్పుడూ విపరీతమైన రద్దీ ఉంటుంది. 300 దర్శనం టిక్కెట్లను మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీఐపీ దర్శన టిక్కెట్లకు అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం. అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా వీఐపీ దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎయిర్ పోర్టునూ…
Read MoreTag: Eeroju news
Kurnool | బెగ్గర్ మాఫియా…. | Eeroju news
బెగ్గర్ మాఫియా…. కర్నూలు, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Kurnool చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారితో బిచ్చమెత్తించి ఆ డబ్బులు తాము వాడుకునే రాక్షసుల గురించి సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజంగానే అలాంటి మాఫియా ఉంది. ఏపీలో ఇలాంటి మాఫియాను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చిన్న పిల్లవాడు ఒంటి నిండా రంగు పూసుకుని గాంధీ అవతారంలో రోడ్డుపై కునికి పాట్లు పడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో చూసి నారా లోకేష్ చలించిపోయారు. వెంటనే ఎవరో ఏంటో తెలుసుకోవాలని.. ఎందుకు అలా భిక్షాటన చేయాల్సి వస్తుందో గుర్తించాలని ఆదేశించారు. కర్నూలులో ఆ పిల్లవాడి కోసం వెదుకుతున్న పోలీసులకు అలాంటి వారు చాలా చోట్ల కనిపించారు. శరీరానికి రంగు పూసుకుని భిక్షాటన చేస్తున్న మరి…
Read MorePawan Kalyan | పదేళ్లు పోయో… మరో పదేళ్లు ఆగాలా… | Eeroju news
పదేళ్లు పోయో… మరో పదేళ్లు ఆగాలా… విజయవాడ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Pawan Kalyan గత ఎన్నికలలో తాను పోటీచేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ పని అయిపోయింది. ఇక రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రతిపక్షాలు గేలిచేశాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. గత ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బాగా కనిపించింది. అనూహ్యంగా కూటమి పక్షాలకు అఖండ విజయం అందించారు ప్రజలు. జనసేన కూడా తనకు కేటాయించిన సీట్లను నిలబెట్టుకోవడమే కాకుండా రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించుకుంది. పవన్ ఏ పదవీ ఆశించకుండానే డిప్యూటీ సీఎం వంటి కీలక పదవి లభించింది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన ప్రభంజనమే కనిపిస్తోంది. అయితే జనసేనానిఉండుండి ఓ…
Read MoreSupreme Hero Saidurga Tej | ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ | Eeroju news
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ Supreme Hero Saidurga Tej ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. ఇటీవల తనను కలిసిన సాయిదుర్గ తేజ్ కు సావర తెగలు చేసిన పెయింటింగ్ ను అందించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయిదుర్గ తేజ్ షేర్ చేశారు. సాయిదుర్గ తేజ్ స్పందిస్తూ – మామయ్య పవన్ కల్యాణ్ దగ్గర నుంచి అందుకునే బ్లెస్సింగ్స్ తో పాటు ఆయన ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు నేను అందుకున్న ఆర్ట్ వర్క్స్ సావర ట్రైబ్ ఆర్టిస్ట్స్ తయారుచేసింది. ఏపీ లేపాక్షి షోరూం నుంచి ఈ…
Read MoreAP News | కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు | Eeroju news
కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు: సిఎం చంద్రబాబు కర్నూల్ నవంబర్ 21 AP News ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లోకాయుక్త, ఏపి హెచ్ఆర్ సి తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని వెల్లడించారు. ఏపి శాసన సభలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. AP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
Read MoreTelangana | కేటీఆర్‌ను జైలుకు పంపిస్తా.. | Eeroju news
కేటీఆర్‌ను జైలుకు పంపిస్తా.. రేవంత్‌రెడ్డి నోట సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణలో రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. లగచర్ల ఘటన తర్వాత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మొన్నటి వరకు రైతు రుణమాఫీ, తర్వాత మూసీ ప్రక్షాళనపై ఇరుపక్షాలు రాజకీయం చేశాయి. ఇప్పుడు లగచర్ల ఘటనపై అధికార, విపక్షాల మధ్య పొలిటకల్ వార్ నడుస్తోంది. లగచర్లలో రైతులను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేయిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు రేవంత్ సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇక అధికారులపై దాడిచేసిన వారిని అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటామని బీఆర్‌ఎస్‌కు దీటుగా బదులిస్తున్నారు. అధికార పార్టీ మంత్రులు, నేతలు. తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి…
Read MoreHydra | రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా | Eeroju news
రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్) Hydra హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణంగా హైడ్రా విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా భయంతో ఇళ్లు కొనాలనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి హైడ్రా చట్టవిరుద్దమన ఒక్క బిల్డింగ్ ను కూడా కూల్చలేదు.ఇంకా చెప్పాలంటే ప్లాన్లు వంటి వాటి జోలికి కూడా వెళ్లలేదు. చెరువు స్థలాల్లో,.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అనుమతులు లేని భవనాలనే కూల్చారు. బడా బాబుల ఫామ్ హౌస్‌లను కూల్చివేసిన తర్వాత మాకూ ఓ హైడ్రా కావాలని జిల్లాల నుంచి పొరుగురాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత హైడ్రాపై జరిగిన ప్రచారం వేరు. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు వేచి చూడాలనే భావనకు వచ్చారు.…
Read MoreTelangana | రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ | Eeroju news
రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్) Telangana భారత రాష్ట్ర సమితి రాజకీయ వ్యూహం పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డినే ఎక్కువ టార్గెట్ చేస్తోంది. ఒక్కో సారి కాంగ్రెస్ పార్టీని రేవంత్ నాశనం చేస్తున్నారని రాహుల్ కు చెబుతున్నారు కేటీఆర్. గాంధీభవన్ లో గాడ్సే అని.. గాడ్సే శిష్యుడు రేవంత్ అని తాజాగా కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా బలహీనం చేయాల్సిన పని లేదు..రేవంత్ ను బలహీనం చేస్తే చాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది. హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గించగలిగితే..ఆయన పనైపోయినట్లేనని తమ పని సులువు అవుతుందని అనుకుంటున్నారు. కేసీఆర్‌కు ఎదురు లేదు అనుకున్న రోజుల్లో.. ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు. అయితే కింది స్థాయి నుంచి వచ్చిన…
Read MoreRK Roja | రోజాకు రియల్ సినిమా.. | Eeroju news
రోజాకు రియల్ సినిమా.. తిరుపతి, నపంబర్ 21, (న్యూస్ పల్స్) RK Roja మాజీమంత్రి ఆర్కే రోజా మరోసారి వార్తల్లోకి ఎక్కారట. ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు రావటంతో… ఆ శాఖ ఇమేజ్ దెబ్బతిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచాక.. రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రెండున్నర సంవత్సరాలు అవకాశాన్ని జగన్ కల్పించారు. అనంతరం రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్.. రోజాకు టూరిజం, క్రీడాశాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇంత అవకాశం ఉన్నా.. రోజా.. తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి గానీ.. ఇటు రాష్ట్రానికి కానీ.. తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదనే విమర్శలను మూటగట్టుకున్నారట.మంత్రి హయాంలో మేడమ్.. తిరుమలకు దర్శనానికి రావడం.. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తప్ప చేసిందేమీ…
Read MoreAP News | కూటమికి కలిసొచ్చిన సమావేశాలు | Eeroju news
కూటమికి కలిసొచ్చిన సమావేశాలు నిలదీసే అవకాశాన్ని వదులుకున్న ప్రతిపక్షం అమరావతి, నవంబర్ 21, (న్యూస్ పల్స్) AP News ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. సభకు వెళ్లినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోతే తమకు మాట్లాడే అవకాశం రాదు కాబట్టి సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వైసీపీ సమావేశాలను బహిష్కరించింది. దీంతో విపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. మండలిలో వైసీపీకి బలం ఉండటంతో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం 11మంది సభ్యులు మాత్రమే గెలుపొందారు. ఎన్డీఏ కూటమి తరపున 164మంది గెలుపొందారు.ఏపీ అసెంబ్లీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు…
Read More