మిస్ యూనివర్స్ గా రియా జైపూర్, సెప్టెంబర్ 23,(న్యూస్ పల్స్) Rhea Singha మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందానికి హద్దులు లేకుపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్ యూనివర్సట్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ఇంతకు ముందుకు విజేతలుగా నిలిచిన వారి నుంచి చాలా నేర్చుకున్నాని రియా చెప్పుకొచ్చింది.…
Read MoreTag: Eeroju news
Jagan | జగన్ ను అడ్డంగా బుక్ చేసిన ఎన్డీయే | Eeroju news
జగన్ ను అడ్డంగా బుక్ చేసిన ఎన్డీయే విజయవాడ, గుంటూరు, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Jagan తిరుమల లడ్డూ వివాదంలో పవన్ తీరు మరింత చర్చకు దారితీస్తోంది. జాతీయస్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారింది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపారని వివాదం రేగిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యవహారం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ఈ ఆవు నెయ్యిని ఏఆర్ అనే కంపెనీ సరఫరా చేస్తోంది. గత జూలైలో ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ లో కల్తీ జరిగిందని నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని…
Read MoreJagan Chalo Bangalore | ఛలో బెంగుళూరు.. | Eeroju news
ఛలో బెంగుళూరు.. కేడర్ లో బయిటపడుతున్న అసహనం అనంతపురం, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Jagan Chalo Bangalore వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరచూ బెంగళూరుకు వెళుతూ పార్టీ నేతలకు అసహనం రేపుతున్నారు. జగన్ ఎప్పుడు అందుబాటులో ఉండకుండా బెంగళూరులో ఉండటం వల్ల ఇక్కడ క్యాడర్ నుంచి లీడర్ల వరకూ ఎలా ధైర్యంగా ఉంటారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పది సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఎవరైనా చనిపోయినా, లేకపోయినా వరదల వంటి ఆకస్మిక ఘటనలు జరిగితే విజయవాడకు వస్తున్నారు తప్పించి ఇక్కడే ఉండి రాజకీయం చేయడానికి జగన్‌కు మనసొప్పడం లేదంటున్నారు. ఆయన ఎక్కువ సమయం బెంగళూరులోని తన ప్యాలెస్ లోనే గడుపుతుండటం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాదు సొంత పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.వైఎస్…
Read MoreCM Chandrababu and Jagan | లడ్డూ వ్యవహారంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ … | Eeroju news
లడ్డూ వ్యవహారంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ … గుంటూరు, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) CM Chandrababu and Jagan తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లుగా రాజకీయం మారుతోంది. టీటీడీ బోర్డు స్వతంత్రంగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాలు బోర్డే చూసుకుంటుంది… అని స్వయంగా సీఎం జగన్ ప్రెస్ మీట్‌లో చెప్పినా.. నెయ్యి కల్తీ వ్యవహారమంతా గత ప్రభుత్వం తప్పే అన్నట్లుగా ఇతర పార్టీలన్నీ ప్రొజెక్ట్ చేశాయి. వైసీపీ దాన్ని తిప్పికొట్టలేకపోయింది. తప్పు చేయలేదని బలంగా వాదించలేకపోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాత్రం అంటున్నారు. ఈ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లెక్కి ఎవరూ ధర్నాలు చేయడం లేదు కానీ..ఉత్తరాదిలో మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. హిందూత్వ రాజకీయాలు దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిన ఎక్కువగా ఉంటాయి. తిరుమల అనేది ఉత్తరాది హిందూ…
Read MoreAP | ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ | Eeroju news
ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ విజయవాడ, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) AP తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్… విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న దేవాలయాలపై గట్టిగానే పడింది. ఆయా ఆలయాల్లో ప్రసాదాలను ఆవు నెయ్యితోనే తయారు చేస్తున్నారా? నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనేదానిపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది.అన్ని అలయాల్లోనూ నెయ్యి క్వాలిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. సింహాచలం, అన్నవరంలో ప్రసాదాల నుంచి శాంపిల్స్ సేకరించారు. అన్నవరం దేవస్థానంలో వాడే నెయ్యి గడ చిన రెండేళ్లుగా ఒకే కాంట్రాక్టర్ సరఫరా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అలాగే అంతర్వేది, వాడపల్లి.. పాదగయ…
Read MoreJana Sena is becoming a Hindu face | హిందూ ఫేస్ గా మారుతున్న జనసేనాని…. | Eeroju news
హిందూ ఫేస్ గా మారుతున్న జనసేనాని…. విజయవాడ, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Jana Sena is becoming a Hindu face సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి.. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా .. అన్ని వర్గాల్లో చర్చ జరగాలి అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదం విషయంలో స్పందించారు. ఈ స్పందన వెనుక లోతైన అర్థం ఉండటంతో పలువురు స్పందించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒకరు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చేసి.. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు. ఇలాంటివి వస్తే.. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా అందుకుంటుందో ప్రకాష్ రాజ్ కు తెలుసు. అందుకే.. అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని శిక్షించాలని సలహా…
Read MoreSingareni workers | సింగరేణి కార్మికులకు భారీ నజరానా | Eeroju news
సింగరేణి కార్మికులకు భారీ నజరానా హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Singareni workers తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను దసరా బోనస్ గా ప్రకటించారు. సింగరేణి సంస్థ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దసరా సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్ ప్రకటించింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్లు లాభం వచ్చింది. ఇందులో సింగరేణి కార్మికులకు 796 కోట్ల రూపాయలు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సగటున ఒక్కో కార్మికుడికి 1.90లక్షలు బోనస్.. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 5వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు భట్టి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నామన్నారు.అనంతరం డిప్యూటీ సీఎం…
Read MoreKCR | మౌనంగానే వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ | Eeroju news
మౌనంగానే వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) KCR అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. తుంటి ఎముకకు గాయం కావడం ఆయణ్ని మరింత నీరసించేలా చేసింది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా… ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌కు తొలిరోజు హాజరైనా… ఆయన మునుపటిలా యాక్టివ్‌గా లేరు. తన వ్యవసాయ క్షేత్రంలోనే సేద తీరుతున్న కేసీఆర్, అడపాదడపా పార్టీ నేతలను కలుస్తున్నారు. కానీ, రాజకీయంగా ఆయన బయటకు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడిదే అంశం.. గులాబీ శ్రేణులను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు నిరుత్సాహపరుస్తోంది.ఇన్నాళ్లూ ఎలా ఉన్నా… ఇప్పుడు తెలంగాణ రాజకీయం మరోసారి రగులుతోంది. అధికారపక్షంతో నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతోంది ప్రతిపక్ష బీఆర్‌ఎస్. ఎమ్మెల్యేల ఫిరాయింపుల నుంచి, పీఏసీ చైర్మన్ పదవి వివాదాస్పదం అవడం దాకా…. రుణమాఫీ నుంచి సెక్రటేరియట్…
Read MoreTS Electricity | ప్రజలకు భారం కానున్న కరెంట్ | Eeroju news
ప్రజలకు భారం కానున్న కరెంట్ హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) TS Electricity తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ అమలు చేస్తోంది. రుణ మాఫీ చేసింది. దసరాకు రైతుభరోసా ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే తొలిసారి ప్రజలకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా అంటే అవుననే అంటున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. తమకు ఇప్పటికే భారీగా లోటు ఉందని, ఈ నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పదని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో 1,200 కోట్లు పూడ్చుకోవడానికి చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. గృహ విద్యుత్ 300 యూనిట్లు దాటితే స్థిర…
Read MoreOne Nation One Election | వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యమేనా | Eeroju news
వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యమేనా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) One Nation One Election వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ చేసిన సిఫార్సులకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘‘మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఇది ముఖ్యమైన అడుగు” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు, విస్తృత శ్రేణి భాగస్వాములను సంప్రదించినందుకు కోవింద్ ను అభినందించారు. లోక్ సభ ఎన్నికల ప్రకటనకు ముందు కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చిలో నివేదిక సమర్పించింది. ఏకకాల ఎన్నికలు: సిఫార్సులు, పరిశీలనలు 1951 నుంచి 1967 వరకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లలో లోక్ సభకు, అన్ని శాసనసభలకు ఒకేసారి…
Read More