Kavitha re-entry | బతుకమ్మ నుంచి కవిత రీ ఎంట్రీ… | Eeroju news

బతుకమ్మ నుంచి కవిత రీ ఎంట్రీ...

బతుకమ్మ నుంచి కవిత రీ ఎంట్రీ… హైదరాబాద్, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Kavitha re-entry బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత… ఇప్పటివరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కవిత… బెయిల్‌ వచ్చి సుమారు నెల రోజులు అవుతున్నా సైలెంట్‌గా ఉండటం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజమాబాద్‌లోనూ ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఐతే, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో విశ్రాంతికి సెలవు ప్రకటించి తనపై రాజకీయ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట కవిత.…

Read More

Laddu scam | లడ్డూ స్కాం,… అరెస్ట్ లు భయం | Eeroju news

లడ్డూ స్కాం,... అరెస్ట్ లు భయం

లడ్డూ స్కాం,… అరెస్ట్ లు భయం తిరుమల, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Laddu scam తిరుమల లడ్డూ వివాదంపై రంగంలోకి దిగేసింది సిట్ టీమ్. సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు తమ పని మొదలుపెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు? టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు? ఆ కంపెనీల లావాదేవీలేంటి? దీనివెనుక ఎవరు కీలకపాత్ర పోషించారు ఇలా రకరకాల విషయాలు వెలుగులోకి రానున్నాయి.తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది… రేగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వం పెద్దలు రంగంలోకి దిగేశారు. మరోవైపు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనని దుయ్యబట్టాయి. పరిస్థితి గమనించిన చంద్రబాబు సర్కార్ తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్…

Read More

Botsa Satyanarayana | జనసేన గూటికి బొత్స లక్ష్మణరావు…? | Eeroju news

Botsa Satyanarayana

జనసేన గూటికి బొత్స లక్ష్మణరావు…? విజయనగరం, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Botsa Satyanarayana వలస రాజకీయంలో ఇదో పెద్ద ట్విస్టు.. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని మార్పు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఓ కీలక నేత జనసేనలో చేరనున్నాడనే సమాచారం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు కుటుంబమే బొత్సకు బలం అనుకుంటుండగా, ఆ కుటుంబం నుంచి ఒకరు బొత్సను ధిక్కరించి రాజకీయంగా విభేదించి జనసేనలో చేరతానని ప్రకటించడం పొలిటికల్‌గా హీట్‌ పుట్టిస్తోంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఓడించేలా ఆయన సొంత సోదరుడే పావులు కదిపాడనే ప్రచారం కూడా కాక రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు ఊహాగానమే అనుకున్నా.. బొత్స ఫ్యామిలీ వార్‌ నిజమని తేలిపోయిందని అంటున్నారు.ఉత్తరాంధ్ర లీడర్లలో బొత్సకు…

Read More

Elephants | ఏనుగుల సమస్యకు ఫుల్ స్టాప్… | Eeroju news

ఏనుగుల సమస్యకు ఫుల్ స్టాప్...

ఏనుగుల సమస్యకు ఫుల్ స్టాప్… తిరుపతి, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Elephants ఏపీ – కర్ణాటక రాష్ట్రాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై శుక్రవారం కీలక ఒప్పందం జరిగింది. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపేలా ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఈ కీలక ఒప్పందం జరిగింది. కాగా, చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బెంగుళూరు వెళ్లిన పవన్.. కర్ణాటక మంత్రి, అక్కడి అటవీ అధికారులతో మాట్లాడి కుంకీ ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా అందుకు వారు సానుకూలంగా స్పందించారు. ‘ఏనుగులు పంట పొలాలు ధ్వంసం చెయ్యడం నా…

Read More

Palasa cashew | టీటీడీకి పలాస జీడిపప్పు… | Eeroju news

టీటీడీకి పలాస జీడిపప్పు...

టీటీడీకి పలాస జీడిపప్పు… శ్రీకాకుళం, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Palasa cashew రాష్ట్రంలో ఒక‌ప‌క్క శ్రీ‌వారి మ‌హా ప్ర‌సాదం తిరుప‌తి ల‌డ్డూపై వివాదం జ‌రుగుతోంది. మ‌రోవైపు తిరుప‌తి ల‌డ్డూ త‌యారీ నిర్విరామంగా జ‌రుగుతోంది. ఈ క్రమంలో లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి తరలిస్తున్నారు. తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే భ‌క్తులు శ్రీ‌వారి ల‌డ్డూ మ‌హా ప్ర‌సాదంగా భావిస్తారు. తిరుమ‌ల వ‌చ్చిన శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న భ‌క్తులు ల‌డ్డూ ప్ర‌సాదాన్ని తీసుకుంటారు. తమ వారి కోసం దానిని తీసుకెళుతుంటారు.టీటీడీ వేసిన బిడ్ శ్రీ‌కాకుళం జిల్లాలోని ప‌లాస‌కు చెందిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ ద‌క్కించుకుంది. స్వామి వారి ద‌య వ‌ల్లే ఈ బిడ్ త‌మ‌కు ద‌క్కింద‌ని ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ అధినేత సంతోష్‌కుమార్ తెలిపారు.శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీకి 30 టన్నుల జీడిప‌ప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్…

Read More

AP | వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ | Eeroju news

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ కాకినాడ, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) AP రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను కూట‌మి ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేసినట్లుగా ప్రకటించారు.ఉమ్మడి జిల్లా నుంచి ఏడు కార్పొరేషన్లల్లో 14 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించారు. అందులో జ‌న‌సేన‌కు ఒక కార్పొరేష‌న్ చైర్మ‌న్, నాలుగు కార్పొరేష‌న్ల‌కు డైరెక్ట‌ర్లు ప‌ద‌వులు ద‌క్కాయి. టీడీపీకి ఎనిమిది డైరెక్ట‌ర్ ప‌ద‌వులు ద‌క్కాయి. బీజేపీ ఒక డైరెక్ట‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. అందులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల…

Read More

Runamafi | సంపూర్ణ రుణమాఫి చేయాలి | Eeroju news

సంపూర్ణ రుణమాఫి చేయాలి

సంపూర్ణ రుణమాఫి చేయాలి హైదరాబాద్ Runamafi తెలంగాణ భవన్ అలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పని తీరు ఎలా ఉందంటే ఎన్నికలపుడు గాల్లో మాటలు ,అధికారం లో గాలి మోటార్ల యాత్రలు అన్నట్టు ఉంది. శ్రీశైలం నిర్వాసితుల సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కరించడం లేదు. తత ప్రభుత్వాలు శ్రీశైలం నిర్వాసితులకు అన్యాయం చేశాయని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నిర్వాసితుల్లో 78 మంది కి కేసీఆర్ ప్రభుత్వం లష్కర్లుగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది. కేసీఆర్ హాయం లో ఆరువేల లష్కర్ ఉద్యోగాలు నింపాలనుకుని అందులో శ్రీశైలం నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకోసం జీవో కూడా ఇచ్చారు. వంత్ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినా అది నెరవేరడం లేదని అన్నారు. పాలమూరు జిల్లాకు…

Read More

Onion prices | 80కి చేరిన ఉల్లి ధరలు | Eeroju news

80కి చేరిన ఉల్లి ధరలు

80కి చేరిన ఉల్లి ధరలు హైదరాబాద్, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Onion prices రాష్ట్రంలో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం మార్కెట్ వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.గతంలో ఉల్లి ధరలు కిలో రూ.20 వరకు పలికిన ధర.. ప్రస్తుతం నాలుగింతలకు ఎగబాకింది. దీంతో సామాన్యులు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మరోవైపు వేసిన పంటలు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. రానున్న కాలంలో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మార్కెట్‌లలో రూ. 50…

Read More

KA Paul | తిరుపతిని యూటీ చేయాలి | Eeroju news

తిరుపతిని యూటీ చేయాలి

తిరుపతిని యూటీ చేయాలి కేఏ పాల్ విశాఖపట్నం KA Paul తిరుమల పవిత్రతను కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేఏ పాల్ సూచించారు. తిరుమలను కలుపుకుని తిరుపతి ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిం చాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని …అ ప్పుడే ఈ ప్రాంతంతో రాజకీయాలు చేయడం ఆపగలమని అన్నారు. కేవలం 741 మంది మాత్రమే వున్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రక టించారు… అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరు పతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని అన్నారు. వెంట నే తిరుపతిని యూటీగా ప్రకటించా లి…లేదంటే ప్రత్యేక దేశాన్నే డిమాం డ్ చేస్తామంటూ కేఏ పాల్ బాండ్ పేల్చారు.ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి…

Read More

BRS | బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? | Eeroju news

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..?

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? కరీంనగర్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) BRS అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పనేం ఉన్నాదన్నట్లు ప్రధానమైన నేతలు అంతా సైలెంట్‌ అయిపోయారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నేత హరీశ్‌ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెదికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట.. అధినేత కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్‌ నేతలు బయటకి ఎందుకు రావడం లేదు.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ పనిలేకుండా పోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బీఆర్‌ఎస్‌ నేతలు ఆ పనిచేయడం లేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారం గల్లంతై 9 నెలలు అవుతున్నా… నూటికి 90 శాతం మంది బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లో కనిపించడం లేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.ముఖ్యనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు పర్యటనల్లో హడావుడి…

Read More