Telangana | 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ | Eeroju news

29న బీఆర్ఎస్ దీక్షా దివస్

29న బీఆర్ఎస్ దీక్షా దివస్ హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Telangana ఈనెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించాలని.. కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణలో మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణపై కేసీఆర్ ముద్రను ఎవరూ చేరిపేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి.. తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు అని స్పష్టం చేశారు. నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని…

Read More

Hyderabad Real Estate | మళ్లీ పెరిగిన రియల్ వ్యాపారం | Eeroju news

మళ్లీ పెరిగిన రియల్ వ్యాపారం

మళ్లీ పెరిగిన రియల్ వ్యాపారం హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Hyderabad Real Estate హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. గడచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. అక్టోబర్‌లో హైదరాబాద్ లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 20 శాతం పెరిగాయని, రియల్ ఎస్టేట్ మార్కెట్ కార్యకలాపాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను కనిపించిందని ఈ సంస్థ సర్వే రిపోర్టు తెలిపింది. అక్టోబర్ నెలలో మొత్తం 5,985 రెసిడెన్షియల్ యూనిట్లు విక్రయించారు. రూ. 3,617 కోట్ల గృహాల అమ్మకాలు జరిగాయని సర్వే తెలిపింది. హైదరాబాద్ నగరంలో నివాస ప్రాపర్టీ లావాదేవీలలో ఏడాదికి 14 శాతం పెరుగుదల నమోదు అవుతున్నట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. ఆగస్టు,…

Read More

Kavitha | కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా… | Eeroju news

కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా...

కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా… లిట్మస్ టెస్ట్ లో ఫెయిలా… హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్ర‌జాక్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవ‌ల అదానీ కేసు విష‌యంలో క‌విత కేంద్రంపై విమ‌ర్శ‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత‌ గురుకుల‌లో ఫుడ్ పాయిజ‌న్ కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ప‌రామ‌ర్శించి కాంగ్రెస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. దీంతో క‌విత‌క్క ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి త‌మ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే క‌విత రీఎంట్రీ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ పెంచినా అన్న కేటీఆర్ కు మాత్రం పోటు త‌ప్ప‌ద‌నే వార్తలు గుప్పుమంటున్నాయి.రాష్ట్రంలో…

Read More

States | ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… | Eeroju news

ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు...

ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… ఆ జాబితాలో చేరిన మహారాష్ట్ర ముంబై, నవంబర్ 25, (న్యూస్ పల్స్) States దేశంలోనే మహారాష్ట్ర ఒక్క రాష్ట్రమే కాదు.. ప్రతిపక్ష నాయకుడు లేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలు భారీ మెజారిటీతో విజయాన్ని నమోదు చేశాయి. మహారాష్ట్ర రాజీకాయాలు గత అయిదు సంవత్సరాలుగా థ్రిల్లర్ సినిమాకు తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా కొన్ని తేలని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు రెండు కూటములుగా తలపడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం వార్ వన్ సైడే అన్నట్లు వెలువడ్డాయి. అధికార మహాయుతి పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ కూటమిలో బిజేపీ, అజిత్…

Read More

Pawan Kalyan | పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ | Eeroju news

పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్

పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర ఎన్నికల్లో మహా యూటీ కూటమి ఘనవిజయం సాధించింది. బిజెపి నేతృత్వంలోని ఆ కూటమి 230 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. బిజెపి సొంతంగా 132 సీట్లు గెలుచుకోగా..శివసేన 57 స్థానాలు..ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం చవిచూసింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20 చోట్ల, కాంగ్రెస్ 16 చోట్ల, శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సిపి పది చోట్ల విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేకే సర్వే అంచనాలు నిజమయ్యాయి. ఆ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా నిలిచాయి. ఈ సంస్థ అధినేత కిరణ్ కొండేటి ఆసక్తికర విషయాలను…

Read More

Ajit Pawar | వారిద్దరి అధ్యాయం ముగిసినట్టేనా అజిత్ పవార్ మరియు శరద్ పవార్ | Eeroju news

వారిద్దరి అధ్యాయం ముగిసినట్టేనా అజిత్ పవార్, శరద్ పవార్

వారిద్దరి అధ్యాయం ముగిసినట్టేనా అజిత్ పవార్ మరియు శరద్ పవార్ ముంబై, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Ajit Pawar మహారాష్ట్ర గెలిచింది. జార్ఖండ్ ఓడిపోయింది. మహారాష్ట్రలోనూ సొంతంగా కాదు కదా.. కూటమి పెట్టుకుంటేనే గెలిచింది కదా.. మహారాష్ట్ర గెలుపు పై కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అది తప్పు కాదు. వారు ఊహించుకున్నట్టుగా తక్కువది కాదు.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి కూటమి గెలిచింది. షిండే మీద వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టింది. అజిత్ పవార్ బలాన్ని మరోసారి నిరూపించింది. దేవేంద్ర ఫడ్నవిస్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయబోతోంది.. ఇది మాత్రమేనా.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలను మూటగట్టుకున్న బిజెపికి బూస్ట్ ఇచ్చింది. మోడీషా ద్వయానికి శక్తి ఇచ్చింది. అయితే ఇదే ఫలితం మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటిదాకా తిరుగులేని…

Read More

Chandrababu Naidu KCR Jagan Revanth Reddy | పాదయాత్రల ట్రెండింగ్ పోయి… అరెస్ట్ ల ట్రెండింగ్… | Eeroju news

Chandrababu Naidu KCR Jagan Revanth Reddy

పాదయాత్రల ట్రెండింగ్ పోయి… అరెస్ట్ ల ట్రెండింగ్… హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Chandrababu Naidu KCR Jagan Revanth Reddy ఒకప్పుడు పాద యాత్ర చేసిన నేతలు సీఎం అవుతారు అన్న సెంటిమెంట్‌ ఉండేది. రెండు దశాబ్దాలుగా.. అరెస్టు అయితే సీఎం అవుతారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిరూపితమవుతోంది.రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇందు కోసం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇవ్వడం ద్వారా, మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా ప్రజలు పార్టీలను గెలిపిస్తారు. అయితే 2004 నుంచి ట్రెండ్‌ మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పాదయాత్ర సెంటిమెంట్‌గా…

Read More

Pawan Kalyan | ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు & పవన్ | Eeroju news

ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు & పవన్

ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు & పవన్ న్యూఢిల్లీ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సాధించిన సంచలన విజయానికి కారణాలేమిటన్నదానిపై అందరూ రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.అందరూ ఓ కారణం చెబుతున్నారు. అదేమిటంటే ఎన్డీఏ నేతల ప్రచారం. మహారాష్ట్రతో సంంబధం లేకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ లాంటి ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు.చంద్రబాబు రెండు రోజుల ప్రచారం ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. కానీ ప్రచారానికి మాత్రం సిద్దమయ్యారు. ఇలా కలసికట్టుగా ప్రచారం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇక ముందు ఇదే ట్రెండ్ కొనసాగించాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పటికప్పుడు స్వీప్ చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా వెనుకబడిపోతోంది. గత మూడు సార్లు అరవింద్…

Read More

Taramandal Technologies in AP | ఫోర్బ్స్ జాబితా చేసిన AP ఆధారిత స్టార్టప్ తారామండల్ టెక్నాలజీస్ | Eeroju news

ఫోర్బ్స్ జాబితా చేసిన AP ఆధారిత స్టార్టప్ తారామండల్ టెక్నాలజీస్

ఫోర్బ్స్ జాబితా చేసిన AP ఆధారిత స్టార్టప్ తారామండల్ టెక్నాలజీస్ లోకల్ టూ గ్లోబల్ అంటున్న విశాఖ కుర్రాళ్లు… విశాఖపట్టణం, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Taramandal Technologies in AP విశాఖకు చెందిన తారమండల్ టెక్నాలజీస్ స్పెస్ టెక్ రంగంలో ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తుందని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. తాజాగా రిలీజ్ చేసిన డి గ్లోబలిస్ట్ లిస్టులో టాప్ 200 స్టార్టప్ జాబితాలో తారమండల్ టెక్నాలజీస్‌కు చోటు కల్పించింది. గ్లోబల్ బిజినెస్ పొటెన్షియల్, ఇన్నోవేషన్, విస్తరణ ప్రణాళికలను గుర్తించి జాబితాలో చోటు కల్పించింది. ఫోర్బ్స్ ఇండియా ఎలైట్ గ్లోబలిస్ట్ జాబితాలో చోటు అంత సామాన్యంగా దక్కదు. కొన్ని వేల స్టార్టప్‌లు తమ ప్రణాళక్ని ఆశయాలను..స్టార్టప్ పురోగతిని వివరిస్తూ నామినేషన్లు పంపిస్తారు. అందులోనుంచి కొన్నింటిని ఎంపిక చేస్తారు. అలా ఫోర్బ్స్ కు వచ్చిన కొన్ని వేల…

Read More

Andhra Pradesh | యువరైతుల పెళ్లి కోసం బండి యాత్ర | Eeroju news

యువరైతుల పెళ్లి కోసం బండి యాత్ర

యువరైతుల పెళ్లి కోసం బండి యాత్ర అనంతపురం, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Andhra Pradesh   స్వలాభం కోసమో… పార్టీల మైలేజ్ కోసమో… రాజకీయ నాయకులు చేసే పాదయాత్రలు.. బస్సు యాత్రలు ఇప్పటివరకు మనం చూసాం… కొందరుతమ అభిమాన తారలను కలిసేందుకు చేసే సైకిల్ యాత్ర… బైక్ యాత్రలు కూడా చూశాం. కానీ ఎద్దుల బండిపై యాత్ర మీరు ఎప్పుడైనా చూసారా… శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు నవీన్ ఎద్దుల బండిపై యాత్ర చేపట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు యువరైతు నవీన్ హిందూపురం నుంచి అమరావతికి ఎద్దుల బండిపై యాత్ర మొదలుపెట్టాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు… మహిళలపై జరుగుతున్న అకృత్యాలు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించేందుకు యాత్ర చేపడుతున్నట్లు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది……

Read More