Tirumala | బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…. | Eeroju news

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ....

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…. తిరుమల, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమంలో క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు ఎలాంటి ఆంటకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా..శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పాలికలలో పుట్టమన్ను వేసి.. అందులో నవధాన్యాలు నాటుతారు. ఆ నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. బ్రహ్మోత్సావాల్లో భాగంగా రోజూ…

Read More

Isha Foundation | ఈషా ఫౌండేషన్ పై హైకోర్టుకు నివేదిక… | Eeroju news

ఈషా ఫౌండేషన్ పై హైకోర్టుకు నివేదిక...

ఈషా ఫౌండేషన్ పై హైకోర్టుకు నివేదిక… కోయంబత్తూరు, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Isha Foundation ఈషా ఫౌండేషన్‌.. ఆధ్యాత్మిక భావాలు ఉన్న హిందువే కాదు. వివిధ మతాలవారు, విదేశీయులకు కూడా ఈ ఫౌండేషన్‌ గురించి తెలుసు. తమిళనాడులోని ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యోగాతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్‌ 1992లో ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో సద్గురు(జగదీష్‌ వాసుదేవ్‌) దీనిని స్థాపించారు. ఈషా యోగా కేంద్రాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వలంటీర్లే దీనిని నిర్వహిస్తున్నారు. నీలగిరి పర్వతాలలో భాగమైన వెల్లియంగిరి శ్రేణిలో 150 ఎకరాల స్థలంలో దట్టమైన అడవులు, ప్రత్యేకమైన వన్యప్రాణుల అభయారణ్యంతో ఉంది. ఇది ప్రఖ్యాత శక్తి కేంద్రం భక్తి, జ్ఞానోదయం, కర్మ, క్రియ వంటి యోగా అన్ని విభాగాలను ఒకే గొడుగు క్రింద…

Read More

Making India for Diwali | దీపావళికి మేకిన్ ఇండియా…. | Eeroju news

దీపావళికి మేకిన్ ఇండియా....

దీపావళికి మేకిన్ ఇండియా…. న్యూఢిల్లీ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Making India for Diwali బతుకమ్మ మొదలైంది. ఈ ప్రకారం పండుగల సీజన్ ప్రారంభమైనట్టే. ఈ నవరాత్రి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో తక్కువ తీరుగా నిర్వహిస్తుంటారు. దసరా, దీపావళి, చాట్ పూజలతో భారతదేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ పండగలవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం నిర్వహించుకునే పండుగలకు.. మనం తయారు చేసే వస్తువులను మాత్రమే వాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. అవి చైనాకు చెక్ పెట్టేలాగా ఉన్నాయని తెలుస్తోంది.. త్వరలో జరుపుకోబోయే దీపావళి పండుగను మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.…

Read More

Jagan | దూరమైన సొంత సామాజిక వర్గం… | Eeroju news

దూరమైన సొంత సామాజిక వర్గం...

దూరమైన సొంత సామాజిక వర్గం… కర్నూలు, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Jagan ఎన్నికల్లో జగన్ రెడ్డి సామాజిక వర్గం ఆదరించలేదా? అభిమానం ఉన్న జనాలతో ఓట్లు వేయించ లేదా? ఇంతటి ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ రెడ్డి సామాజిక వర్గం సుదీర్ఘకాలం కాంగ్రెస్ వెంట నడిచింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యమిచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అదే సమయంలో వైసీపీ ఉన్నతికి కృషి చేసిన…

Read More

AP News | మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే | Eeroju news

మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే

మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) AP News ఎమ్మెల్సీ రాజీనామా వ్యవహారంలో వైసీపీ వ్యూహం ఏంటి? నాన్చుడు ధోరణితో వ్యవహరించాలని చూస్తుందా? శాసనమండలి చైర్మన్ ద్వారా ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోందా? ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిలో టిడిపి కూటమి బలం పెరగకూడదని చూస్తోందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి సైతం గుడ్ బై చెప్పారు. ఎప్పుడో ఆగస్టులో తమ పదవులకు రాజీనామా చేస్తే ఇప్పటివరకు అవి ఆమోదం పొందలేదు. అందులో ఇద్దరు స్వయంగా మండలి చైర్మన్ మోసేన్ రాజుకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. వ్యక్తిగత సమస్యలతోనే తాము పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఎంతవరకు…

Read More

Polavaram | పోలవరం పరుగులే… | Eeroju news

పోలవరం పరుగులే...

పోలవరం పరుగులే… ఏలూరు, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Polavaram పోలవరం ప్రాజెక్టు పనులు 2026 మార్చికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు, పునరావాసం వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ. 30,436,95 కోట్లతో తాజా డీపీఆర్ ను ఆమోదించింది. దీని వల్ల ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ. 12,157 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజా డీపీఆర్ ఆమోదం తరువాత ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కృషితో పోలవరానికి అడ్వాన్స్ గా నిధులిచ్చేందుకూ కేంద్రం ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి రూ. 5,500 కోట్లు, ప్రధాన డ్యాం కాలువల్లో నిర్మాణ పనులకు రూ. 1,700 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అధికారుల అంచనా వేశారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల…

Read More

YS Jagan | జగన్ బలం..బలగం ఎక్కడ… | Eeroju news

జగన్ బలం..బలగం ఎక్కడ...

జగన్ బలం..బలగం ఎక్కడ… విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) YS Jagan నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోగానే ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో, మండలిలో, ఇటు లోక్ సభ, రాజ్యసభలో కావాల్సినంత బలం ఉండేది. వాటితో ఎవరిపై ఆధారపడకుండానే సొంతంగానే చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉండేది.ఒకవైపు రాష్ట్రంలో శాసనసభ రూపొందించే చట్టాల్లో ఆ పార్టీదే ముఖ్యపాత్ర ఉండేది. మరోవైపు పార్లమెంటులోనూ వైసీపీది చెప్పుకునే స్థాయి పాత్రే. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. వైఎస్ జగన్ పార్టీ ప్రాధాన్యం లేకుండానే కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో బిల్లులు పాస్ కానున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11…

Read More

Amaravati | అమరావతికి నిధుల వరదే | Eeroju news

అమరావతికి నిధుల వరదే

అమరావతికి నిధుల వరదే విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణంపై తీపికబురు అందింది. ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు ఊతమిచ్చేలా ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్ కన్సార్షియం నుంచి కేంద్ర ప్రభుత్వ హామీతో రుణాన్ని మంజూరు చేయడానికి సమ్మతి తెలిపాయి. గత ఐదేళ్లుగా అమరావతి పనులు నిలిచిపోవడంతో పాటు అంతకు ముందు చేపట్టిన పనులకు సంబంధించి దాదాపు రూ.9వేల కోట్ల మేర బిల్లులు బకాయి చెల్లించాల్సి ఉంది.2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి అమరావతి పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనుల పునురుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి నిధులు గ్యారంటీగా ఇస్తామని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. గతంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకులు అమరావతి నిర్మాణానికి రుణాలు…

Read More

RTC Jobs | ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు | Eeroju news

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) RTC Jobs తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాజాగా కరీంనగర్‌లో 33 విద్యుత్‌ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు వెల్లడించారు. ఆయన ఇంకా ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మహాలక్షి పథకం కింద ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా మరిన్ఇన ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్‌ బస్సు సర్వీసులను…

Read More

Hyderabad | హైదరాబాద్ లో డీజేలపై నిషేధం…. | Eeroju news

హైదరాబాద్ లో డీజేలపై నిషేధం....

హైదరాబాద్ లో డీజేలపై నిషేధం…. హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Hyderabad హైదరాబాద్‌ నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతిమించింది.. పెళ్లి బరాత్‌లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఈవెంట్ ఏదైనా కావొచ్చు చెవులకి చిల్లు పడే డీజే సౌండ్‌ కామన్ అయిపోయింది.. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చడం.. ఇలాంటి ఫుల్ సౌండ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులకు చిల్లులు పడటమే కాదు.. ఒక్కోసారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి.. శబ్ధకాలుష్యం.. ముఖ్యంగా డీజేపై ఇటీవల ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు సైతం అందాయి.. డీజేల వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం కూడా నిర్వహించారు. చాలా మంది.. డీజేపై నిషేధం విధించాలని.. సౌండ్ సిస్టమ్ విషయంలో కొన్ని షరతులు విధించాలని,…

Read More