Gudivada MLA Venigandla Ramu | ప్రజా సమస్యల పరిష్కారానికై….ఇప్పటికి 9సార్లు సీఎం చంద్రబాబును కలిశాను | Eeroju news

Gudivada MLA Venigandla Ramu

గుడివాడ అభివృద్ధి….ప్రజా సమస్యల పరిష్కారానికై….ఇప్పటికి 9సార్లు సీఎం చంద్రబాబును కలిశాను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ Gudivada MLA Venigandla Ramu రాబోవు ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తూ…. రోడ్లు, డ్రైనేజీ వసతులను పూర్తిస్థాయిలో కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే రాముకు…. టిడిపి శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సెంటర్లో టిడిపి జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే రాము ప్రజా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రజలతో స్వయంగా మాట్లాడుతూ…. వారి వద్ద నుండి వినతుల అర్జీలను స్వీకరించారు. ప్రజా వేదికలో పాల్గొన్న అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే…

Read More

CM Chandrababu | తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు | Eeroju news

CM Chandrababu

తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు   CM Chandrababu   : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (శుక్రవారం) తిరుమలకు రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. 5.30 నుంచి 7.30 వరకు పద్మావతి అతిథి గృహంలో చంద్రబాబు బస చేయనున్నారు. చంద్రబాబు దంపతులు 7.30 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు పట్టువస్త్రాలతో బేడీలు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. చంద్రబాబు దర్శనం అనంతరం ఆలయం వెలుపల వాహన మండపంలో జరిగే భారీ శేషవాహన సేవలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు.రాత్రి 9.30 గంటలకు పద్మావతి…

Read More

Telangana Rains | రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు | Eeroju news

రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు హైదరాబాద్ అక్టోబర్ 3 Telangana Rains రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉందని చెప్పింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలుపడే ఛాన్స్‌ ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శనివారం నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి,…

Read More

Large scale solar plants in Telangana | తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు | Eeroju news

తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు

తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు హైదరాబాద్ అక్టోబర్ 4 Large scale solar plants in Telangana జపాన్ దేశంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తోషిబా ప్రధాన కార్యాలయం, పరిశ్రమల సందర్శన, ఫ్యూయల్ సెల్ విభాగాలఏర్పాటు, తదితర అంశాలపై సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. ఉదయం 8 గంటలకు ఆయన టోక్యో నగరం నుండి బయలుదేరి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ బహుళ జాతి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా వారి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్, భారత రాయబార కార్యాలయ అధికారులు బన్సల్ దేవజాని…

Read More

YS Sharmila Deeksha | దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ | Eeroju news

దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ

దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ విశాఖపట్టణం, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) YS Sharmila Deeksha విశాఖలో షర్మిల స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా దీక్షకు దిగారు. చంద్రబాబు నలభై ఎనిమిది గంటల్లో 4200 మంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట కార్మికుల ను వెంటనే పనిలోకి తీసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే నిరాహారదీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దీక్ష శిభిరంలో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీక్షా శీబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన తెలిపారు. కనీసం నోటీసు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుండటం దారుణమని.. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని ఇవ్వకుండా రోడ్డున పడేశారని మండిపడ్డారు. కనీసం కాంట్రాక్ట్ పనులు చేసుకోనే వీలులేకుండా చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని.. కాంగ్రెస్ పార్టీ కేంద్ర,…

Read More

Jani Master | జానీకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు! | Eeroju news

జానీకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

జానీకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు! హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Jani Master ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు టీవీ అండ్ సినిమా డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం కటకటాల పాలు అయిన సంగతి తెలిసిందే.‌ ఆయన దగ్గర సహాయకురాలిగ పని చేసిన ఒక మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసుతో పాటు ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ మీద అభియోగాలు నమోదు అయ్యాయి. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు జానీ. దీని పై విచారణ జరిపిన కోర్టు…

Read More

Nalgonda | మూసీ కాలుష్యం నల్గొండకు తాగునీటికీ కష్టాలు | Eeroju news

మూసీ కాలుష్యం నల్గొండకు తాగునీటికీ కష్టాలు

మూసీ కాలుష్యం నల్గొండకు తాగునీటికీ కష్టాలు నల్గోండ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Nalgonda ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదులలో ఔషధ కాలుష్యంపై స్విస్ కు చెందిన ఓ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో అత్యంత కాలుష్యంగా మారిన నదుల్లో మూసీ ప్రపంచ వ్యాప్తంగా 22వ స్థానంలో ఉంది. మూసీ నది కాలుష్యంతో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుంది.ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లోని 258 నదులపై స్విస్ ఆర్గనైజేషన్ ప్రపంచ నదులలో ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. అత్యంత కాలుష్యంగా మారిన నదులపై 2022లో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు మూసీ నది 22వ స్థానంలో ఉంది. కనీసం 70 కిలోమీటర్ల మేర 48 రకాల రసాయన అవశేషాలు ఆ పరీక్షల్లో మూసీలో బయట పడ్డాయి. ఈ వివరాలు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్…

Read More

Palm Oil | పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ | Eeroju news

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ మహబూబ్ నగర్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Palm Oil పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచడంతో తెలంగాణలో పామాయిల్ రైతుల పంట పండింది. పామాయిల్ గెలల ధర అమాంతం రూ. 2651 వేలు పెరిగి రూ.17 వేలకు చేరింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.పామాయిల్ రైతులకు అధిక ధరను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామాయిల్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఉద్ధేశంతో ముడిపామాయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామాయిల్ రైతులను ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని కోరిన…

Read More

Kavitha | కవితకు ఏమైంది… | Eeroju news

కవితకు ఏమైంది...

కవితకు ఏమైంది… హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Kavitha బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలు నుంచి ఇటీవలే విడుదల అయ్యారు. సుమారు మూడు నెలల అనంతరం ఆమె బెయిల్ పై రిలీజ్ అయ్యారు. దాదాపు నెల గడిచిపోయింది ఆమె జైలు నుంచి బయటకు వచ్చి కూడా. కానీ.. అప్పటి నుంచి ఆమె ఇంతవరకు ప్రజల్లోకి రాలేదు. ఆమె రాక కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు.కనీసం ఇప్పటికైనా ఆమె ప్రజల్లోకి వస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కవిత ఎంతో యాక్టివ్‌గా పనిచేశారు. ఇటు పార్టీ కోసం.. అటు ప్రజల కోసం నిత్యం పరితపించారు. రాష్ట్రవ్యాప్తంగానూ పొలిటికల్‌గా తన మార్క్…

Read More

HYDRA | హైడ్రాకు మరిన్ని అధికారాలు… | Eeroju news

హైడ్రాకు మరిన్ని అధికారాలు...

హైడ్రాకు మరిన్ని అధికారాలు… హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) HYDRA హైడ్రా.. ఈ పేరు వింటేనే హైదరాబాద్‌లోని ఎల్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో నిర్మించిన ఇళ్ల యజమానుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తుతున్నాయి. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్‌ తమ ఇంటిపైకి వస్తుందో అని వణికిపోతున్నారు. రెండు నెలల క్రితం ఏర్పడిన హైడ్రా తన దూకుడుతో ఇప్పటికే వందల ఎకరాలకుపైగా ఆక్రమిత స్థలాన్ని చెర విడిపించింది. ఇందుకోసం వందలాది ఇళ్లు, ఇతర నిర్మాణాలను నేల మట్టం చేసింది. చేస్తోంది. హైడ్రా దూకుడుతో నిత్యం పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. మూడు రోజుల క్రితమే హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు కాస్త బ్రేకులు వేసింది. అయినా హైడ్రా కూల్చివేతలు మాత్రం పూర్తిగా ఆగలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ౖహె డ్రాకు మరిన్న అధికారాలు కట్టబెట్టింది. హైడ్రాకు చట్టబద్ధత, అధికారాలను…

Read More