Priyanka | వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక | Eeroju news

వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక

వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక న్యూఢిల్లీ, అక్టోబరు 16,(న్యూస్ పల్స్) Priyanka మరో కీలక ఎన్నికల సమరానికి నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలతో పాటు కీలకమైన వయనాడు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 13న వయనాడు పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న వయనాడు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందిఈసారి కాంగ్రెస్‌ పార్టీకి మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు వయనాడు పార్లమెంట్ ఉప ఎన్నిక ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండటమే. గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడుతో పాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో…

Read More

AP Cabinet | ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం | Eeroju news

ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం

ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం విజయవాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) AP Cabinet ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కేబినెట్‌ ముందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కొత్త పాలసీలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ఏపీ క్లీన్‌ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని రూపొందించింది. ఇవే కాకుండా ఏపీ…

Read More

Hyderabad | హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌ | Eeroju news

హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌

హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌ హైదరాబాద్, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Hyderabad ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు ఉన్న స్థానం ప్రత్యేకం. హైదరాబాద్‌ కూడా రోజురోజుకూ అదే స్థాయిలో పేరుప్రఖ్యాతలు సాధిస్తోంది. అలాగే.. అదే స్థాయిలో విస్తరిస్తోంది కూడా. పల్లెల నుంచి నిత్యం మహానగరానికి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. సిటీ జనాభా ఏటా అమాంతం పెరుగుతోంది. అయితే.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జీహెచ్ఎంసీ సైతం సదుపాయాలు కల్పిస్తోంది. సరికొత్త పద్ధతులను అవలంబిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు రాకుండా వినూత్న ప్రయోగాలకు దిగుతోంది. ఇప్పటికే నగర ప్రజల కోసం మెట్రోను, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకు రాగా.. మరో కొత్త ఆలోచనకు తెరతీసింది. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ కష్టాలు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాలంటే పెద్ద టాస్క్. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతోపాటే వాహనాల సంఖ్య కూడా పెరుగుతూనే…

Read More

CEC Rajeev Kumar | ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. | Eeroju news

ట్యాంపరింగ్ సాధ్యం కాదు..

ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన సీఈసీ రాజీవ్‌కుమార్   న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) CEC Rajeev Kumar మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలవేళ ఈవీఎం లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్‌ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్‌ నేత రషీద్‌ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్‌కుమార్‌.. కాంగ్రెస్‌ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్‌పోల్స్‌ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.…

Read More

BJP vs Congress | మహారాష్ట్రలో హోరా హోరి తప్పదా | Eeroju news

మహారాష్ట్రలో హోరా హోరి తప్పదా

మహారాష్ట్రలో హోరా హోరి తప్పదా ముంబై, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) BJP vs Congress ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పట్లో బీజేపీ, శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. శివసేన 56 సీట్లతో రెండో స్థానంలో ఉంది. బీజేపీ-శివసేన కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో ఎన్సీపీ 54 స్థానాలతో మూడో స్థానంలో, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లలో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో అనేక రాజకీయ భూకంపాలు…

Read More

Jana Sena | మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం | Eeroju news

మోడీ ఫోటో ఎక్కడా... జనసేనాని ఆగ్రహం

మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం కాకినాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Jana Sena ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. కేంద్ర నిధులతో చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ తన ‘ x ” హ్యాండిల్ లో అధికారులకు సీరియస్ గానే క్లాస్ పీకారు.కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాల్ పెయింట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయని విషయం ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి వచ్చింది. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన…

Read More

Elephants Hulchul in Chittoor Dist | చిత్తూరులో గజరాజుల బీభత్సం.. | Eeroju news

చిత్తూరులో గజరాజుల బీభత్సం..

చిత్తూరులో గజరాజుల బీభత్సం.. తిరుపతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Elephants Hulchul in Chittoor Dist ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య రోజు రోజుకు తీవ్రతరం అయ్యింది. రైతులకే కాదు ఏనుగుల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారింది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాదు రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.అడవిని వదిలి గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగు గుంపు పీలేరులో మరో రైతును పొట్టన పెట్టుకుంది. గజరాజులు చిత్తూరు జిల్లా రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఏనుగుల సమస్య రైతాంగానికి అతి పెద్ద సమస్యగా మారింది. పంట పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపెడుతున్నారు. శేషాచలం అడవులు, కౌండిన్య అభయారణ్యంతో పాటు చిత్తూరు జిల్లాకు ఇరువైపులా ఉన్న తమిళనాడు కర్ణాటక అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులు పంట నష్టం, ప్రాణ నష్టాన్ని మిగుల్చుతున్నాయి.…

Read More

Amaravathi | అమరావతికి కొత్త కళ | Eeroju news

అమరావతికి కొత్త కళ

అమరావతికి కొత్త కళ అమరావతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Amaravathi అమరావతికి కొత్త కళ వస్తోంది. దాదాపు జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కావడంతో.. అమరావతి రాజధాని యధాస్ధానానికి చేరుకొనుంది.డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేయించింది. ఈ నిధులు సైతం విడుదల కానున్నాయి. పలుమార్లు అమరావతిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రుణం మంజూరుకు ఆమోదముద్ర వేశారు. ఇది పూర్తిస్థాయి కేంద్రం సర్దుబాటు చేసే నిధులు. కేంద్రమే హామీ ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం మాత్రమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆ పది శాతం నిధులు…

Read More

One is the CM and the other is the Deputy CM | సూపర్ హిట్ జోడి.. | Eeroju news

సూపర్ హిట్ జోడి.....

సూపర్ హిట్ జోడి….. అమరావతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) One is the CM and the other is the Deputy CM ఒకరేమో సీఎం.. మరొకరేమో డిప్యూటీ సీఎం.. వారిద్దరి లక్ష్యం ప్రజాసంక్షేమ పాలన సాగించడమే. అయితే ఒకరిది సుధీర్ఘ రాజకీయ చరిత్ర.. మరొకరిది అందుకు భిన్నమైనా ఊహించని రీతిలో రాజకీయ రంగప్రవేశం చేసి, సక్సెస్ అయ్యారు. అంతవరకు ఓకే కానీ.. అనతి కాలంలోనే డిప్యూటీ సీఎంగా ప్రజల మన్ననలు పొందడమే కాక, ఏకంగా పల్లెలను అభివృద్ది బాటలో పయనింపజేసేందుకు భారీ ప్రణాళిక రూపొందించారు ఆయన. అందుకు సీఎంగా సుధీర్ఘ అనుభవం గల ఆ నేత.. తన ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఇంతకు అభినందించిన సీఎం చంద్రబాబు అయితే.. అభినందనలు అందుకున్న వారు ఎవరో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా..…

Read More

CM Chandra Babu | ఎమ్మెల్యేలకు బాబు మార్క్ క్లాస్…. | Eeroju news

సూపర్ సిక్స్ కోసం.. అక్షరాల లక్షా20 వేల కోట్లు

ఎమ్మెల్యేలకు బాబు మార్క్ క్లాస్…. విజయవాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) CM Chandra Babu ఏపీలో మద్యం నూతన పాలసీ విధానాన్ని ప్రభుత్వం రేపటినుండి ప్రవేశపెడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే అందుకు సంబంధించి ఇప్పటికే నూతన విధాన ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించి.. లాటరీ పద్ధతిని సైతం అన్ని జిల్లాలలో అధికారులు నిర్వహించారు. ఈ లాటరీ పద్ధతి కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించగా.. పలుచోట్ల జరిగిన ఘటనల ఆధారంగా ప్రభుత్వం సీరియస్ అయింది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు.. పరోక్షంగా మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిని బెదిరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు.. తానే రంగంలోకి దిగి.. పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఏపీలోని అన్ని జిల్లాలకు సంబంధించి మద్యం షాపుల లైసెన్సుల కోసం 89,882 దరఖాస్తులు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మొత్తం…

Read More