Chandrababu | డ్రోన్లపై గురిపెట్టిన చంద్రబాబు | Eeroju news

డ్రోన్లపై గురిపెట్టిన చంద్రబాబు

డ్రోన్లపై గురిపెట్టిన చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్ప్) Chandrababu మొన్న ద్వాక్రా..నిన్న ఐటి.. నేడు డ్రోన్.. చంద్రబాబు ఆలోచనకు హ్యాట్సాఫ్ చంద్రబాబు ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. 1995లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. మహిళల స్వయం సమృద్ధికి డ్వాక్రా సంఘాలు, యువతకు ఉద్యోగాల కోసం ఐటీ ని ప్రోత్సహించారు. ఇప్పుడు కొత్తగా డ్రోన్ల వ్యవస్థపై పడ్డారు.ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు.రాజకీయాల్లో ప్రతి నాయకుడికి విభిన్న పార్శ్యాలు ఉంటాయి. రాజకీయంగా చాలా రకాల విమర్శలు ఉంటాయి.అపవాదులు వస్తాయి. అవి సర్వసాధారణం కూడా. అయితే చంద్రబాబుపై అనుకూలతలు అధికం. ఆయన లెక్క వేరేగా ఉంటుంది. ఆలోచన ముందు తరానికి ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. 20 సంవత్సరాల ముందు చూపుతో ఆయన ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం…

Read More

Ram Charan | రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్… తర్వాత గ్లోబల్ స్టార్ | Eeroju news

రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్... తర్వాత గ్లోబల్ స్టార్

రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్… తర్వాత గ్లోబల్ స్టార్ Ram Charan గ్లోబల్ రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో మైనపు బొమ్మతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను చిరస్థాయిగా మార్చుకోబోతున్నారు. 2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కరించనున్నారు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన చేశారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు, ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా చరణ్ “మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు”ని అందించారు.సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టాత్మకమైన సూపర్‌స్టార్ల లైనప్‌లో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. చిన్నప్పుడు, దిగ్గజ నటుల జీవితకాలపు వ్యక్తులను చూసి నేను ఆశ్చర్యపోయే వాడిని. ఏదో ఒక రోజు వారి మధ్య నేను…

Read More

RK Roja | హోం మంత్రిపై రోజా కామెంట్స్ | Eeroju news

హోం మంత్రిపై రోజా కామెంట్స్

హోం మంత్రిపై రోజా కామెంట్స్ అమరావతి, RK Roja ఏపీలో ఇటీవల వరుసగా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా హోంమంత్రి అనితపై హాట్ కామెంట్స్ చేశారు. మీ పార్టీ ఆఫీస్కు 10కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో దుండగుడు నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? అని రోజా ట్విట్టర్ వేదికగా హోం మంత్రిపై విమర్శలు గుప్పించారు.   RK Roja Comments On Chandrababu Attending Unstoppable | బాలయ్య షోలో చంద్రబాబు..రెచ్చిపోయిన రోజా ?

Read More

TBJP is set right | టీబీజేపీ సెట్ రైట్ అయినట్టేనా | Eeroju news

టీబీజేపీ సెట్ రైట్ అయినట్టేనా

టీబీజేపీ సెట్ రైట్ అయినట్టేనా హైదరాబాద్, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) TBJP is set right తెలంగాణ బీజేపీలో అంతా సెట్‌ రైట్ అయినట్టే కనిపిస్తోంది. ఇంతవరకూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్ననేతలు..ఒక్కతాటిపైకి వచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ సునీల్‌బన్సాల్ పర్యటన, నేతలతో కీలక సమావేశాల నేపథ్యంలో కాషాయ నేతలంతా ఏకమయ్యారు. దీంతో కమలం పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే జోష్‌లో మూసీ అంశంలో ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది..తెలంగాణ బీజేపీ. మూసీ బాధితుల కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ 25న ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా కూడా చేపట్టింది తెలంగాణ బీజేపీ..మరోవైపు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలిసిన బీజేపీ నేతల బృందం.. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం, హిందూ సంఘాలపై కేసుల నమోదుపై ఫిర్యాదు చేసింది.…

Read More

BRS | మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..? | Eeroju news

మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..?

మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..? ముంబై, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) BRS మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి గులాబీ పార్టీ దూరమైంది. గులాబీ పార్టీ పోటీ చేయడం లేదన్న సంకేతాలు ఇవ్వడంతో మహారాష్ట్రకు చెందిన ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర రాజ్యసమితి పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఒక్కటిగా ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటంతో ఇక జాతీయ రాజకీయాలపై ఏ మాత్రం ఫోకస్ పెట్టడం లేదని…

Read More

Yadagirigutta Temple | యాదగిరిగుట్టపై ఫోటోలు… వీడియోలు నిషేధం | Eeroju news

యాదగిరిగుట్టపై ఫోటోలు... వీడియోలు నిషేధం

యాదగిరిగుట్టపై ఫోటోలు… వీడియోలు నిషేధం నల్గోండ, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Yadagirigutta Temple తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది ఈ యాదగిరి గుట్ట.. యదాద్రిగా పిలవబడుతోంది. అయితే ఇకపై యాదగిరిగుట్ట పైన ఫొటోలు, వీడియోలు నిషేధం విధిస్తున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్ రావు ప్రకటించారు. స్వామీ వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రతిష్టకు… వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేదిస్తున్నామని వెల్లడించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగి జ్ఞాపకంగా భద్రపరుచుకుంటే అభ్యంతరం లేదన్నారు. అయితే వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకునే చర్యలతో ఆలయ ప్రతిష్టకు భంగం కలుగ డంతోపాటు…

Read More

Jagan and YS Sharmila | జగన్ – షర్మిల మధ్య రాజీ.. | Eeroju news

జగన్, షర్మిల మధ్య రాజీ..

జగన్ – షర్మిల మధ్య రాజీ.. విజయవాడ. అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Jagan and YS Sharmila ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలిక్కి వస్తూండటమేనని చెబుతున్నారు. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అని ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన షర్మిల తర్వాత సొంత రాజకీయం ప్రారంభించారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ పెద్దగా ఫలితం ఉండదని అంచనాకు రావడంతో వ్యూహాత్మకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడానికి…

Read More

Nara Lokesh | నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం | Eeroju news

నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం

నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం విజయవాడ, అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Nara Lokesh ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ తరచూ ఢిల్లీ వెళ్తుననారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ముఖ్యంగా అమిత్ షాతో తరచూ సమావేశం అవుతున్నారు. మీడియాకు తెలిసే ఆయన నాలుగైదు సార్లు సమావేశం అయ్యారని.. మీడియాకు తెలియకుండా ఇంకా చాలా సార్లు చర్చలు జరిపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అమిత్ షాతో దాదాపుగా గంటసేపు చర్చించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నారా లోకేష్ అధికారక సమవేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. కానీ అధికారిక సమావేశాలు ఉన్నది సోమవారం.. ఆదివారం ఆయన అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశ ఎజెండా ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులేనని చెబుతున్నారు. కానీ అది పూర్తిగా…

Read More

Tirumala | తిరుమల బోర్డు ఎప్పుడు… | Eeroju news

తిరుమల బోర్డు ఎప్పుడు...

తిరుమల బోర్డు ఎప్పుడు… తిరుమల, అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Tirumala కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచిపోతున్నాయి. ఇంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నియామకం జరగలేదు. కనీసం స్పసిఫైడ్ అథారిటీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో టీటీడీ చరిత్రలో మొదటి బ్రహ్మోత్సవాలు అధికారుల పర్యవేక్షణలో సాగాయి.త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమలపై గత నెల మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలక మండలిలో.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 దేవాలయాలు పాలక మండళ్లను అతి త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. అది చెప్పి నెల గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు టీటీడీ పాలక మండలి ప్రస్తావనే రావడం లేదు.టీటీడీ చరిత్రలో పాలకమండలి…

Read More

Tirumala Controversy | తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా | Eeroju news

Tirumala Controversy

తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా తిరుమల, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Tirumala Controversy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై కొన్ని నెలల కిందట ఏపీ, తెలంగాణకు సంబంధించి పెద్దలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. కొన్ని విషయాల్లో క్లారిటీ రాగా, మరికొన్ని విషయాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తిరుమల విషయంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లిన తమకు తగిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ లాంటివి పాటించడం లేదని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తమ సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని, తమ వారికి కనీసం గదులు కూడా కేటాయించడం…

Read More