GST revenue | తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం | Eeroju news

తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం

తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం న్యూఢిల్లీ, నవంబర్ 4 (న్యూస్ పల్స్) GST revenue ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.3,815 కోట్లు, తెలంగాణ‌లో రూ.5,211 కోట్లు జీఎస్టీ వ‌సూలు అయిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.2024 అక్టోబ‌ర్ వ‌ర‌కు ఎస్‌జీఎస్‌టీ నిధులు ఆంధ్రప్ర‌దేశ్‌కు రూ.19,171 కోట్లు ఇచ్చిన‌ట్లు, తెలంగాణ‌కు రూ.25,306 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలిపింది.అక్టోబ‌ర్- 2024 కు సంబంధించిన జీఎస్టీ వ‌సూలు దేశ‌వ్యాప్తంగా రూ.1,42,251 కోట్లు వ‌సూలు అయ్యాయ‌ని, గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రూ.1,28,582 కోట్లు వ‌సూలు అయ్యాయ‌ని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఏకంగా 10.63 శాతం వ‌సూళ్లు పెరిగాయ‌ని వెల్లడించింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌తేడాది అక్టోబ‌ర్ రూ.3,493 కోట్లు వ‌సూలు కాగా, ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో రూ.3,815 కోట్లు పెరిగింద‌ని, పెరుగుద‌ల 12 శాతం న‌మోదు అయింద‌ని కేంద్రం తెలిపింది. తెలంగాణ‌లో గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రూ.4,868 కోట్లు వ‌సూలు…

Read More

DK Aruna Comments On CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ | Eeroju news

సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ హైదరాబాద్ DK Aruna Comments On CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎంపి డికె అరుణ మండిపడ్డారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో డికె శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారు . అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలి. ప్రధాని మోడీ…

Read More

Godavari Pushkaras | గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ… | Eeroju news

గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...

గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ… రాజమండ్రి, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Godavari Pushkaras కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. గోదావరి పుష్కరాలకు అంతా సిద్ధమవుతుంది. ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని సౌకర్యాలతో పాటు భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాలు2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి.…

Read More

YCP | వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. | Eeroju news

వైసీపీ సైలెంట్ ప్లానింగ్....

వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. విశాఖపట్టణం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) YCP మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా నేడు కూటమిపై విమర్శల జోరు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుండి ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కోలుకుంటున్నారని చెప్పవచ్చు. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కాగా, మాజీ సీఎం జగన్ ఇటీవల నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలన కాలంలో అంతా తానై ముందుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. ఇటీవల టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసుల విచారణకు సజ్జల హాజరయ్యారు.అప్పుడు కనిపించిన సజ్జల, తాజాగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. ఆదివారం తిరుపతిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని,…

Read More

Atchannaidu son’s political entry | అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… | Eeroju news

అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ...

అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… శ్రీకాకుళం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Atchannaidu son’s political entry తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు క్రమంగా సీనియర్ నేతలకు అర్ధమవుతున్నాయి. ఒకవైపు జరుగుతున్న పరిణామాలతో ముందు జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది సీనియర్లు పార్టీ లో ఫేడ్ అవుట్ అయ్యారు. కేబినెట్ కూర్పులోనే ఈ విషయం స్పష్టమయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పటికీ.. చినబాబు నారా లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి మంత్రి వర్గం విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఏది చూసినా లోకేష్ ముద్ర కనిపిస్తుంది. సీనియర్లు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. కుటుంబ నేపథ్యం, పార్టీలో వారికున్న ట్రాక్ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. సీనియర్ నేతలు అనే…

Read More

TDP VS Janasena | దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన | Eeroju news

దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన

దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన ఏలూరు, నవంబర్ 4, (న్యూస్ పల్స్) TDP VS Janasena కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో మిత్ర పక్షాల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తుంది. మద్యం దుకాణాల కేటాయింపు, ఇసుక సిండికేట్లు, నామినేటెడ్ పదవుల విషయంలో ఇలా ప్రతి విషయంలో ఒకరినొకరిపై విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా కూటమి పార్టీలు స్వీప్ చేసిన తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ ఆధిపత్య పోరు ఎక్కువగా కనపడుతుంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ కూటమి నేతల మధ్య విభేదాలు పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారాయి.. ప్రధానంగా పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఈరోజు అనేక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు…

Read More

Ramachepa | రామచేప రేటే వేరప్పా…. | Eeroju news

రామచేప రేటే వేరప్పా....

రామచేప రేటే వేరప్పా…. కాకినాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Ramachepa పులస చేప తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరికి వరదనీరు వచ్చినప్పుడు జాలర్లకు చిక్కే ఈ చేపలు.. వారి దండిగా కాసులను అందిస్తాయి. జులై నుంచి అక్టోబర్‌ వరకు పులసలు చిక్కుతూ ఉంటాయి. రుచితో పాటు ఎన్నో పోషక విలువలు ఈ చేప సొంతం. పల్లెటూర్లలో ఎవరైనా పులస.. కొని వండుకున్నారంటే.. ఊరంతా ఆ విషయాన్ని ఆ రోజు గొప్పగా చెబుతుంటారు. అది పులస రేంజ్. ఇక పులస మాదిరిగానే.. గోదావరి జిల్లాల్లో ‘రామ చేప’ కూడా చాలా పాపులర్. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. రామ చేపలు చూడటానికి బొమ్మిడాయిలు మాదిరిగానే ఉంటాయి. టేస్ట్ అయితే పులసల లాగానే ఉంటుందట. ఈ చేపలు 5 నుంచి 7…

Read More

RCs and driving licenses in smart cards | స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు… డ్రైవింగ్ లైసెన్సులు | Eeroju news

స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు.. డ్రైవింగ్ లైసెన్సులు

స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు.. డ్రైవింగ్ లైసెన్సులు రాజమండ్రి, నవంబర్ 4, (న్యూస్ పల్స్) RCs and driving licenses in smart cards కొత్త వెహిక‌ల్స్ కొనేవారికి, లైసెన్స్‌లు తీసుకునేవారికి రాష్ట్రం ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు స్మార్ట్ కార్డుల్లో ఇవ్వనున్నట్లు రవాణా శాఖ తెలిపింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లు స్మార్ట్‌కార్డుల్లో రానున్నాయి. కొత్త వెహిక‌ల్స్ కొనేవారికి, లైసెన్స్‌లు తీసుకునేవారికి రాష్ట్రం ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని ర‌వాణా శాఖ‌లో స్మార్ట్ కార్డుల‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. స్మార్ట్ కార్డుల స‌ర‌ఫ‌రాకు టెండ‌ర్ల పిలిచేందుకు ప్రక్రియ మొద‌ల పెట్టింది. కొత్త వాహ‌నం కొనుక్కుని, ర‌వాణా శాఖ‌లో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్ పొందిన‌ప్పుడు అంద‌జేసే డీఎల్ కార్డుల…

Read More

AP Budget | 11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ | Eeroju news

11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ

11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ విజయవాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) AP Budget ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా… పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ 11వ తేదీన లేదా మరునాడు వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశం…

Read More

AP New ration cards | జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు | Eeroju news

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు విజయవాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) AP New ration cards   కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తుంది. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులు జారీ చేయనున్నారు. వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రస్తుత కార్డుల రీడిజైన్‌ తో పాటు కొత్త లబ్ధిదారులందరికీ రేషన్…

Read More