Chevireddy Bhaskar Reddy | బూమ్ రాంగ్ అవుతున్న చెవిరెడ్డి వ్యూహాలు | Eeroju news

బూమ్  రాంగ్ అవుతున్న చెవిరెడ్డి వ్యూహాలు

బూమ్  రాంగ్ అవుతున్న చెవిరెడ్డి వ్యూహాలు తిరుపతి, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Chevireddy Bhaskar Reddy మాజీ మంత్రి గల్లా అరుణ కూమారి అనుచరుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనదైన శైలిలో చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయం నడిపారు.. విభజించి పాలించే పద్ధతితో హడావుడి చేశారు . అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న టైపులో ఆయన వ్యవహారం నడిచింది. జగన్ హయాంలో ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యారు. ఏపీ, తెలంగాణల్లో వైసీపీ, బీఆర్ఎస్‌ నేతలకు ఆప్తుడిగా వ్యవహరించాడు. సోషల్ మీడియాలో సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకుని సర్వేల పేరుతో రెండు పార్టీల అధోగతికి కారణమైన లీడర్ ఆయనవైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను అనుకున్నది అనుకున్నట్లు చేసిన చేవిరెడ్డికి .. అధికారం కోల్పోవడంతో బ్యాడ్ టైమ్ స్టార్ అయిందన్న టాక్ నడుస్తుంది. దానికి…

Read More

Operation Gudivada.. Chandrababu Focus on Kodali Nani | టీడీపీ ఆపరేషన్ గుడివాడ … | Eeroju news

టీడీపీ ఆపరేషన్ గుడివాడ ...

టీడీపీ ఆపరేషన్ గుడివాడ … విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Operation Gudivada.. Chandrababu Focus on Kodali Nani గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వస్థలమైన ఆ సెగ్మెంట్‌పై తిరిగి పట్టు సాధించిన టీడీపీ దాన్ని మరింత బిగించేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. 1983లో ఎన్టీఆర్ గుడివాడ నుంచి గెలిచిన నాటి నుంచి మధ్యలో ఒక్క 1989 ఎన్నికలు మినహా 2009 వరకు అక్కడ టీడీపీ జెండానే ఎగురుతూ వచ్చింది. 2004 లో తొలిసారి టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని 2009లో రెండోసారి కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే గానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత పార్టీ మారి టీడీపీ రెబల్ అవతారమెత్తారు. వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ…

Read More

Pawan Kalyan | మరాఠ ప్రచారానికి పవన్ కళ్యాణ్ | Eeroju news

మరాఠ ప్రచారానికి పవన్ కళ్యాణ్

మరాఠ ప్రచారానికి పవన్ కళ్యాణ్ విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు జాతీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రులను రంగంలోకి దించాలని ఆలోచన చేస్తోంది బీజేపీ. దీంతో కొంతైనా గట్టెక్కవచ్చని ఆలోచన చేస్తోంది బీజేపీ.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువు ఉండరు. ఎప్పుడు.. ఎవరు.. ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీల చూపంతా మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పడ్డాయి.శివసేన, ఎన్సీపీని చీల్చిన బీజేపీ, కొన్నాళ్లు మహారాష్ట్రను తెర వెనుక నుంచి రూలింగ్ చేసింది. ఈ విషయాన్ని రాజకీయ నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు. ఈ పీఠాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కమలనాథులు.బుధవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…

Read More

Chandrababu | నిన్న రాష్ట్ర మంత్రి… ఇవాళ కేంద్ర మంత్రి | Eeroju news

నిన్న రాష్ట్ర మంత్రి... ఇవాళ కేంద్ర మంత్రి

నిన్న రాష్ట్ర మంత్రి… ఇవాళ కేంద్ర మంత్రి బాబు క్లాస్ విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Chandrababu మొన్న రాష్ట్రమంత్రి సుభాష్‌కు క్లాస్ తీసుకున్న చంద్రబాబు నేడు రామ్మోహన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై సీరియస్‌. వేరే కార్యక్రమాలు ఉంటే వర్చువల్‌గానైనా రావాలని హితవు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇవాళ సబ్‌స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేందమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరుకాలేదు. ఏం జరిగిందని ఆరా తీసిన చంద్రబాబు… ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు డుమ్మాకొట్టడం మంచిది కాదని సూచించారు. సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎక్కడ ఉన్నారని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విజయవాడలో వేరే కార్యక్రమం ఉందని అక్కడకు వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై చంద్రబాబు కాస్త అసహనం…

Read More

Raghu Raju | ఎమ్మెల్సీ లెక్క తేలినట్టేనా | Eeroju news

ఎమ్మెల్సీ లెక్క తేలినట్టేనా

ఎమ్మెల్సీ లెక్క తేలినట్టేనా విజయనగరం, నవంబర్ 7, (న్యూస్ పల్స్) Raghu Raju విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు విడుదల నోటిఫికేషన్ నిరర్థకమయింది.  ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ వేసిన అనర్హతా వేటు చట్ట విరుద్దమైనదిగా హైకోర్టు ప్రకటిచింది. దీంతో ఎన్నిక ఆగిపోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు టీడీపీలో చేరారు.కానీ రఘురాజు పార్టీ మారలేదు. అయితే టీడీపీకి మద్దతుగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. రఘురాజు నుంచి వివరణ తీసుకోకుండానే అనర్హతా వేటు వేశారు. తాను ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించలేదని తనపై వేసిన అనర్హతా వేటు  చెల్లదని రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉండగానే  ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా విచారణలో…

Read More

CM Chandrababu | సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు | Eeroju news

సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు

సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు నిందితుడికి  రిమాండ్ గుంటూరు CM Chandrababu సోషల్ మీడియాలో సిఎం చంద్ర బాబు ,ఉండి ఎమ్మెల్యే పై  అనుచిత పోస్టుల పై  పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసామని గుంటూరు వెస్ట్ డిఎస్పీ  జయరాం ప్రసాద్ వెల్లడించారు. అనుచిత పోస్టుల పెట్టిన వెంకట్రామి రెడ్డి నీ అరెస్టు చేశాం . నిందితుడు పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. నిందితుడు వైసిపి  సోషల్ మీడియా విధులు నిర్వర్తిస్తున్నారు.  నిందితుడు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. నిందితుడు కికోర్టు 14  రోజులు రిమాండ్ విధించిందని అన్నారు. ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న – కస్తూరి|Actress Kasturi’s sensational statement

Read More

KTR | కేటీఆర్ పాదయాత్ర కు క్లియెరెన్స్ ..? | Eeroju news

కేటీఆర్ పాదయాత్ర కు క్లియెరెన్స్ ..?

కేటీఆర్ పాదయాత్ర కు క్లియెరెన్స్ ..? హైదరాబాద్, నవంబర్ 7, (న్యూస్ పల్స్) KTR భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారని టాక్ నడుస్తుంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవ్వడంతో పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారన్న అభిప్రాయం ఉంది. కేటీఆర్ జిల్లా పర్యటనల పైన దృష్టి సారించడం లేదని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు జిల్లాల పర్యటనలు , కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రైతు నిరసనల పేరుతో హరీష్ రావు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. హరీశ్‌ దూకుడుతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వెనుక పడిపోతున్నారని చర్చ జరుగుతోంది.డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికే కేటీఆర్ రైతు…

Read More

Pithapuram | పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం | Eeroju news

పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం

పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం కాకినాడ, నవంబర్ 7, (న్యూస్ పల్స్) Pithapuram ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను పవన్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. ఈ స్థలంలో త్వరలోనే ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపారు. ఎన్నికల సమయంలో..పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ అన్నారు. ఈ మాట మేరకు జులైలో పిఠాపురం నియోజకవర్గంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో గతంలో 1.44, 2.08 ఎకరాల స్థలం కొన్నారు. తాజాగా ఈ ప్రాంతంలోనే మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు.ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 13, 28, 29 పరిధిలో 12 ఎకరాలను పవన్‌…

Read More

Regional Rural Banks Merge | దేశంలో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం | Eeroju news

దేశంలో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం

దేశంలో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం విజయవాడ, నవంబర్ 7, (న్యూస్ పల్స్) Regional Rural Banks Merge ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి కేంద్రం మరో అడుగు ముందుకేసింది. నవంబర్ 20లోగా గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల నుంచి విలీనంపై అభిప్రాయాలు సేకరించనుంది. దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను 23గా విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది.బ్యాంకుల విలీనంపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చుల నియంత్రణ కోసం దేశంలోని పలు గ్రామీణ బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దశల వారీగా బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టిన ఆర్థిక మంత్రిత్వ శాఖ…నాలుగో దశలో గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టనుంది. ఈ దశలో 43 గ్రామీణ బ్యాంకుల సంఖ్య వీలనం చేసి 28కు తగ్గించనుంది. విలీన ప్రక్రియకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రణాళికలు సిద్ధం…

Read More

Congress vs BRS | కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ | Eeroju news

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు తిరిగిన ద్వితీయ శ్రేణి నాయకులు నల్గోండ, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Congress vs BRS సమగ్ర కుటుంబ సర్వేపై పార్టీ కార్యకర్తల్లో అవగాహన కల్పించి గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల వారీగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలకు ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మూడు రోజుల కిందట నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేమలు వీరేశం నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ హాజరయ్యారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…

Read More