Jagan | చక్రవ్యూహంలో జగన్ | Eeroju news

చక్రవ్యూహంలో జగన్

చక్రవ్యూహంలో జగన్ కడప, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Jagan ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా కేసులు వైసీపీకి కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి. అరెస్టు అవుతున్న వారంతా వైసీపీకి, వైసీపీ ముఖ్య నేతలకు ఆత్మీయులే. అలాగని వారిని గట్టిగా సమర్థించలేకపోతున్నారు. కొంత మంది అసలు తమ పార్టీ నేతలు అని చెప్పుకోవడానికి జంకే పరిస్థితి వస్తోంది. ఆస్తుల వివాదంలో ఇప్పటికే కుటుంబంలో అవినాష్ రెడ్డి వైపు బంధువులు తప్ప జగన్ కు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కేసుల వల్ల అవినాష్ రెడ్డినీ జగన్ దూరం పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది వైసీపీ అధినేతను కలవరపాటుకు గురి చేస్తోందిగత వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో మహిళల్ని కించ పరిచిన వారిపై పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. అరెస్టులు చేస్తున్నారు. ఇంటూరి రవికిరణ్…

Read More

Telangana | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సవాలు విసిరిన కేటీఆర్ | Eeroju news

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సవాలు విసిరిన కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సవాలు విసిరిన కేటీఆర్ హైదరాబాద్ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. 50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన నీకు అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయి. మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుంది. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న కుట్రలాగానే అనిపిస్తుందని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధలు పోస్ట్ చేస్తే కుట్రగానే కనిపిస్తుంది. పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే అది కుట్రగానే అనిపిస్తుంది. 9 నెలలపాటు నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసి, నీ బెదిరింపులన్ని తట్టుకొని, చివరికి ఎదిరిస్తే అది నీకు కుట్ర లాగానే అనిపిస్తుంది .…

Read More

Minister Kandula Durgesh | రిషికొండ ప్యాలస్ నిర్మాన ఖర్చు రూ 409 కోట్ల 39 లక్షలు | Eeroju news

రిషికొండ ప్యాలస్ నిర్మాన ఖర్చు రూ 409 కోట్ల 39 లక్షలు

రిషికొండ ప్యాలస్ నిర్మాన ఖర్చు రూ 409 కోట్ల 39 లక్షలు మంత్రి కందుల దుర్గేష్ అమరావతి Minister Kandula Durgesh శాసనసభలో రిషికొండ ప్యాలెస్ కు సంబంధించి జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు. మొదటి ప్రశ్నకు సమాధానంగా విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 19 లో రిషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో భవనాన్ని నిర్మించడం జరిగింది. 7 బ్లాక్ లతో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ను ఏపీ టీడీసీ వాళ్ళు నిర్మించడం జరిగింది. రిషికొండలో భవనాల నిర్మిత విస్తీర్ణం పరిశీలిస్తే విజయనగరం, కళింగ, గజపతి, వేంగి బ్లాక్ లతో కలిపి మొత్తం ఐదు బ్లాక్ లు ఉన్నాయి. ఏ బ్లాక్ లో…

Read More

AP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

ఢిల్లీకి చంద్రబాబు

ఢిల్లీకి చంద్రబాబు న్యూఢిల్లీ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) AP CM ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటనకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు , ఏడీబి రుణాలపై సంతకాలు జరిగాయి. ముందస్తుగా పనులు ప్రారంభించడానికి అవసరమైన అడ్వాన్సులను విడుదల చేయాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం ఇటీవల పలు రకాల నిధులు, పెట్టుబడుల ప్రకటనలు చేసింది. వాటిని ఫాలో అప్ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని…

Read More

Telangana | తెలంగాణలో పెరిగిన చలి | Eeroju news

తెలంగాణలో పెరిగిన చలి

తెలంగాణలో పెరిగిన చలి అదిలాబాద్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ‌లో చ‌లి తీవ్ర‌త రోజు రోజుకు పెరుగుతోంది. వ‌ర్షాకాలం పూర్తై చ‌లికాలంలోకి అడుగుపెట్ట‌గానే ఊష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోతున్నాయి. గ‌త ప‌ది రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్ర‌త మ‌రింత పెరిగిపోయింది. ప‌లు జిల్లాల్లో రాత్రి ఊష్ణోగ్ర‌త‌లు 15 డిగ్రీల దిగువ‌కు ప‌డిపోయిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. ఉత్త‌ర‌, ఈశాన్య దిశ నుండి గాలులు వీస్తున్న కార‌ణంగా చ‌లి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉందని అధికారులు వెల్ల‌డించారు. చ‌లితో పాటూ భారీగా పొగ‌మంచు ఉండ‌టంతో రోడ్డుపై వెళ్లే వాహ‌నదారులు సైతం ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వాహనదారులు నెమ్మ‌దిగా చూసుకుంటూ వెళ్లాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక నిన్న అర్ధ‌రాత్రి నుండి తెల్ల‌వారుజాము వ‌ర‌కు చ‌ల్లటి గాలులు వీచాయి. ప‌గ‌టిపూట సైతం కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగా న‌మోద‌య్యాయ‌ని…

Read More

KTR | కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్‌ చేస్తారని ప్రచారం | Eeroju news

కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్‌ చేస్తారని ప్రచారం

కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్‌ చేస్తారని ప్రచారం హైద్రాబాద్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) KTR ఫార్మా కంపెనీ భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్‌ కలెక్టర్‌‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి కేసు తెలంగాణలో రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. సీఎం సొంత నియోజక వర్గంలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. పట్నం రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్‌ పేరును ప్రస్తావించడంతో ఆయన్ని కూడా అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది.కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పట్నంను ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో…

Read More

Modi and Chandrababu | మోడీ తర్వాత పవర్ ఫుల్ చంద్రబాబే… | Eeroju news

మోడీ తర్వాత పవర్ ఫుల్ చంద్రబాబే...

మోడీ తర్వాత పవర్ ఫుల్ చంద్రబాబే… విజయవాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Modi and Chandrababu ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇండియన్ మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీ నిలిస్తే..ఐదో స్థానంలో నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ చంద్రబాబు తన శక్తి యుక్తులతో పార్టీని అధికారంలోకి తేగలిగారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో కష్టనష్టాలను అధిగమించారు. నిందలు, అపవాదులను ఎదుర్కొన్నారు. పడిపోయిన ప్రతిసారి…

Read More

Pakistan | పాకిస్తాన్ లో పెట్రో బాంబు… | Eeroju news

పాకిస్తాన్ లో పెట్రో బాంబు...

పాకిస్తాన్ లో పెట్రో బాంబు… లాహోర్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Pakistan పాకిస్థాన్ ద్రవ్యోల్బణం బంధంలోకి జారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇది అక్కడ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మరికొద్ది రోజుల్లో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా ఇటీవల పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం కారణంగా లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, హెచ్‌ఎస్‌డి ధరలు బ్యారెల్‌కు సుమారు 1.7డాలర్లు, 4.4డాలర్ల మేర పెరిగాయి. ఇది కాకుండా, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం బ్యారెల్‌కు దాదాపు 1డాలర్ పెరిగి బ్యారెల్‌కు 9.80డాలర్లకి చేరుకుంది. అయితే హెచ్ఎస్డీ లో ఈ ప్రీమియం బ్యారెల్‌కు 5డాలర్ల స్థాయిలో స్థిరంగా ఉంది.అంతకుముందు అక్టోబర్ 31న ప్రభుత్వం…

Read More

Tourist Place | కాకినాడలో వలసల పక్షులు సందడి | Eeroju news

కాకినాడలో వలసల పక్షులు సందడి

కాకినాడలో వలసల పక్షులు సందడి కాకినాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Tourist Place శీతాకాలం ప్రవేశంతోనే కాకినాడ జిల్లా కోరింగలో వివిధ రకాల పక్షుల సందడి వాతావరణం నెలకొంటుంది. ఆహార అన్వేషణలో భాగంగా వేల కిలోమీటర్ల దాటి ఇక్కడకు చేరుకుంటాయి ఈ అందమైన పక్షులు.. కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్యం మడ అడవుల్లో ఆహారం లభించే చోట ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆరు నెలల పాటు అక్కడ ఉండి తిరిగి ఆయా దేశాలకు వెళ్తాయి.సైబీరియా, మంగోలియా, రష్యా చైనా ఒడిశాలోని మహానది, చంబల్ ప్రాంతాల నుండి విదేశీ వలస పక్షులు కోరింగ అభయారణ్యానికి చేరుకుంటాయి. ఇప్పటికి ఐ.పోలవరం మండలం బైరవ పాలేనికి ఇండియన్ స్కివర్ పక్షులు వచ్చాయి. నవంబరు నుండి మార్చి వరకు అభయారణ్యంలో 12 ప్రాంతాల్లో కనిపిస్తాయి. కోరంగిలోని హోప్ ఐలాండ్స్ కాకినాడ ఏటిమొగ,…

Read More

AP CRDA | పెరిగిన సీఆర్డీఏ పరిధి | Eeroju news

పెరిగిన సీఆర్డీఏ పరిధి

పెరిగిన సీఆర్డీఏ పరిధి గుంటూరు, నవంబర్ 14, (న్యూస్ పల్స్) AP CRDA ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని కుదించడంతో అమరావతి పరిధి గణనీయంగా తగ్గిపోయింది. దీనిని పూర్వపు స్థితికి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్‌డిఏ ఏర్పాటైన సమయంలో భవిష్యత్ అవసరాలతో పాటు భారీ నగరాన్ని నిర్మించే లక్ష్యంతో సిఆర్‌డిఏను విజయవాడ-గుంటూరు నగరాల చుట్టూ 8వేల చదరపు కిలోమీటర్ల పరిధి నిర్ణయించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పరిధిని ,సిఆర్‌డిఏ పరిధిని కుదించారు. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. తాజాగా పూర్వపు సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ మునిసిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తెనపల్లి పురపాలక సంఘంతో పాటు పల్నాడు జిల్లాలోని 92గ్రామాల్లోని 1,069.55చదరపు కి.మీ విస్తీర్ణానికి పెంచారు. దీంతో పాటు బాపట్లలో 562.41 చదరపు కిలోమీటర్ల…

Read More