ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ గుంటూరు, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Nagarjuna Sagar ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదం నెలకొంది. తెలంగాణ అధికారులు కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు ప్రయత్నించగా, ఏపీ అధికారుల వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది సరిగ్గా నవంబర్ లోనే సాగర్ పై ఘర్షణ తలెత్తింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి ‘నాగార్జున సాగర్ వివాదం’ రాజుకుంది. గత ఏడాది సరిగ్గా నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్ లోనే సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు వివాదానికి దారితీసింది. వాటర్ రీడింగ్…
Read MoreTag: Eeroju news
Rice ATM | ఏపీలో రైస్ ఏటీఎంలు | Eeroju news
ఏపీలో రైస్ ఏటీఎంలు కాకినాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Rice ATM సాంకేతికతను మరింతగా వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైస్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు అవుతున్న రైస్ ఏటీఎంల విధానం ఇక్కడకూడా అమలు చేయాలని చూస్తోంది. రైస్ ఏటీఎంలు ఏర్పాటు ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ తీసుకునే వీలు కలుగుతుంది. అంతే కాకుండా రేషన్ దుకాణాల్లో క్యూలైన్లు లేకుండా కూడా చూడొచ్చు. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. పనికి వెళ్లే వాళ్లు తమ పనులు మానుకొని రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా అక్రమాలకు చెక్ పెట్టే వీలు ఉంటుంది. ఈ రైస్ ఏటీఎంలకు అనుగుణంగా ఉండేలా రేషన్…
Read MoreAP | బూమ్ రాంగ్ అవుతున్న నిర్ణయాలు | Eeroju news
బూమ్ రాంగ్ అవుతున్న నిర్ణయాలు విజయవాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) AP వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. జగన్ నేతలను కలుపుకుని వెళ్లడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఉన్నారు. జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఆయన ఏదీ నేతలతో పార్టీ విషయాలను ముందుగా పంచుకునే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తుంది. అసలు వైసీపీకి ఒక పార్టీ కార్యవర్గం ఉందా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏ పార్టీలోనైనా నాయకుడు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీల్లోనూ పొలిట్ బ్యూరోలు వంటివి ఉంటాయి. జగన్ అనుకున్నది అనుకున్నట్లే జరగాల్సింది. జగన్ రెండు విషయాలను ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలను…
Read MorePawan kalyan | రాజకీయాలపై జనసేనాని పట్టు | Eeroju news
రాజకీయాలపై జనసేనాని పట్టు విజయవాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Pawan kalyan ఒకటి మాత్రం నిజం.. ఏపీ పాలిటిక్స్ ను దగ్గర నుంచి పరిశీలించిన వారికి ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉంటేనే పాలిటిక్స్ ఉంటాయి. లేదంటే లేదు అన్నట్లుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటు అధికార పక్షం గాని, అటు విపక్షం గాని పవన్ నామస్మరణ లేకుండా మాత్రం పూట గడవటం లేదు. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో నెంబర్ వన్ గా నిలిచారంటే వినేవాళ్లకు అతిశయోక్తి అనిపించొచ్చు గాని.. ఆయన చేతుల మీదుగానే రాజకీయాలు నడుస్తున్నాయన్నది వాస్తవం. ఆయనతో గొడవలు పెట్టుకుంటే లాస్ అయ్యేది తమదేనన్న భావన మిగిలిన రాజకీయ పార్టీల నేతలకు బలంగా పడిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్…
Read MoreTelangana | 10వ తరగతి పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల.. | Eeroju news
10వ తరగతి పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Telangana పదవ తరగతి పరీక్ష ఫీజు తేదీలను తెలంగాణ ప్రాథమిక విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 18 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 18వ తేదీ వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు అవకాశం కల్పించారు. అంతే కాకుండా రూ.500 రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 21వ తేదీనే చివరి తేదీగా ప్రకటించింది. ఆ తరవాత ఫీజు కట్టేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఫీజుల వివరాల విషయానికి వస్తే… రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ. 125 చెల్లించాల్సి…
Read MoreMalla Reddy | మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు | Eeroju news
మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Malla Reddy పీజీ మెడికల్ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య ఎదురైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలోని ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. స్థలాన్ని కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే స్థలాన్ని కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి 641, 642, 643, 644 సర్వే నెంబర్‌లలో ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలం ఉండేదని బాధితులు తెలిపారు. పిట్ల వీరయ్యకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నారని చెప్పారు.…
Read MoreBC Commission Chairman | ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! | Eeroju news
ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! బీసీ కమిషన్ చైర్మన్ హైదరాబాద్ BC Commission Chairman ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. సొంత యంత్రాంగం, సిబ్బంది లేకపోవడం, బీసీ కమిషన్ కోరితేనే సర్వే బాధ్యతను ప్లానింగ్ శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పా రు. సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు పౌరులు సహకరించాలని, సమస్య లు తలెత్తితే కలెక్టర్లు, బీసీ కమిషన్ దృష్టికి తేవాలని సూచించారు. CM Chandra babu | కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. | Eeroju news
Read MoreKTR and MLA Kaushik Reddy | ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్ | Eeroju news
ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్ హైదరాబాద్ KTR and MLA Kaushik Reddy హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై కేటీఆర్ ఆగ్రహం వ్య క్తం చేసారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపింది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే…మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తాం. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు…
Read MoreMega Krishna Reddy | మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం… | Eeroju news
మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం… హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Mega Krishna Reddy మేఘా కృష్ణారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా బడా కాంట్రాక్టులు ఆయన కంపెనీలే చేస్తూంటాయి. తెలంగాణలో కాళేశ్వరం అయినా.. ఏపీలో పోలవరం అయినా మేఘా ఇంజినీరింగే కాంట్రాక్టర్. ఇవి అతి భారీ ప్రాజెక్టులు. కింది స్థాయి వరకూ కొన్ని వేల కాంట్రాక్టులు ఆయన సంస్థకు దక్కి ఉంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ఒలెక్ట్రాకు చెందినవి. ఇది మేఘా గ్రూప్ కంపెనీనే. ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వారికి ప్రతీపాత్రుడు. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. మేఘా ఇంజినీరింగ్…
Read MoreTraffic in Mumbai after London | లండన్ తర్వాత ముంబైలోనే ట్రాఫిక్ | Eeroju news
లండన్ తర్వాత ముంబైలోనే ట్రాఫిక్ ముంబై, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Traffic in Mumbai after London కాలం మారుతున్న కొద్దీ పట్టణాలు, నగరాల జనాభా పెరిగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఇతర అవసరాకలు ఎక్కువ శాతం మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తుంటారు. కొందరు ఇక్కడే నివాసం ఏర్పరుచుకోవడంతో ఇక్కడి జనాభా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు పై ప్రయాణించాలంటే ట్రాపిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ నగరాల్లో ఉదయం, సాయంత్రం కార్యాలయాకు వెళ్లాలంటే నరకంగా మారుతుంది. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్లన్నీ ఖాళీ లేకుండా కనిపిస్తాయి. ఈ నేప్యంలో టామ్ టామ్ అనే సంస్థ ట్రాఫిక్ ఎక్కుగా ఉన్న నగరాలు ఏవో గుర్తించింది. ఈ సంస్థ చెప్పిన ప్రకారం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏవో తెలుసుకుందాం..ప్రపంచ వ్యాప్తంగా…
Read More