ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న డ్రోన్లు విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Drones clearing traffic విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. డ్రోన్లను వినియోగిస్తు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు.. వినూత్నంగా ఆలోచించి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నారు. లైవ్ డ్రోన్ కెమెరాల (లైవ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్) ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిశీలించి.. సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. విజయవాడ నగరంలో పలు కూడళ్లలో తరుచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా రామవరప్పాడు రింగ్ దగ్గర, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో ఎప్పడూ భారీగా వాహనాలు నిలిచిపోతుంటాయి. ఇటు హైదరాబాద్ రూట్లోనూ భారీగా వాహనాలు రాకపోకలు…
Read More