సీపీఎస్ కోసం ఉద్యోగుల ఒత్తిడి హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) CPS employees కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ విధానం.. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందనే వాదనలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తరువాత.. వారికి రావాల్సిన భృతి అందటం ప్రశ్నార్ధకంగా మారింది. 2004 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సీపీఎస్ విధానాన్ని ఉపాధ్యాయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి.. అమలు బాధ్యతను ఇచ్చికంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జీవో ఎంఎస్ నెంబర్ 653, 654, 655 ద్వారా అమలు చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత.. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని తమ నిర్ణయాన్ని అడిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం జీవో…
Read More