ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన సీఈసీ రాజీవ్‌కుమార్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) CEC Rajeev Kumar మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలవేళ ఈవీఎం లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్‌కుమార్.. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్‌పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.…
Read More