క్యాన్సర్ కు వ్యాక్సిన్… మాస్కో, డిసెంబర్ 19, (న్యూస్ పల్స్) మారుతున్న జీవన శైలి.. ఉరుకుల పరుగుల జీవితం.. ఆహారంలో మార్పుల కారణంగా వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఇంటి పంట.. ఇంట్లో వండిన వంటను మాత్రమే తినేవారు. రసాయనాలు లేని పంటలు పండించేవారు. ఎలాంటి విషతుల్యం కాని పాలు తాగేవారు. నిల్వ చేయని మాంసం తినేవారు. దీంతో అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తక్కువగా వచ్చేవి. కానీ, మారుతున్న కాలంతో జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగింది. పాలను రసాయనాలతో నిల్వ చేస్తున్నారు. వాటినే మనం తాగుతున్నాం. ఇక మాసం కూడా ఫ్రీజ్ చేసి అమ్ముతున్నారు. ఇలా అన్ని ఆహార పదార్థాలు కలుషితం…
Read More