గులాబీ నేతలకు వరుస నోటీసులు | A series of notices to rose weavers | Eeroju news

కరీంనగర్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ ప్రభుత్వం వేసిన కమిషన్లు బీఆర్ఎస్ నేతలకు నోటీసుల మీద నోటీసులు పంపించడంతో అధికారులు షాకవుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు, అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. తాజాగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ వంతైంది. బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులైన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. పీసీ ఘోష్‌ను తన కార్యాలయంలో విలేకరులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అఫిడవిల్లలో ఉన్న వివరాల ఆధారంగా నోటీసులపై తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా మరోసారి తనిఖీలకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాంకేతిక అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్, త్వరలో ఉల్లంఘనలపై ఫోకస్ చేయనుంది.ముఖ్యంగా డిజైన్,…

Read More

కారును కాపాడుకొనేది ఎలా | How to maintain a car | Eeroju news

హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) ఓడలు బండ్లు అవుతాయి.. బండు ఓడలు అవుతాయి అన్నది సమెత. ఈ సామెత తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. పదేళ్లు తెలంగాణలో నంబర్‌వన్‌గా, తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ.. ఆరు నెలల క్రితం ఓటరు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడమే ప్రశ్నార్థకమైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కారు స్పీడ్‌కు బ్రేకులు వేయగా.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు.. కారును పంక్చర్‌ చేసింది. పదేళ్లు తెలంగాణకు తాను ప్రభువును అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్‌ అతని కుటుంబాన్ని ప్రజాస్వామ్యంతో తమకున్న ఓటు అనే ఆయుధంతో కిందకు దించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నేతల్లో అహంకారం తగ్గలేదు. ఇదే తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన స్కామ్‌లు, కుంభకోణాలను…

Read More

ఫేక్ జీవోలు…మండిపడుతున్న టీ కాంగ్రెస్… | Fake creatures.. Burning Tea Congress… | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ.. ఇది ముమ్మాటికి నిజమనిపిస్తుంది కొన్ని సీన్స్‌ను చూస్తే.. దీనికి లెటెస్ట్ ఎగ్జాంపుల్ TS నుంచి TGకి పేరు మార్చేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రచారం. ఒకరు 2 వేల కోట్లు అంటారు.. మరికొందరు 4 వేల కోట్లు అంటారు. ఇంతకీ ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..?తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరగానే తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో.. TS నుంచి TGగా పేరు మార్చడం ఒకటి.. మరి చెప్పినంత ఈజీగా జరగదు కదా పని.. గవర్నమెంట్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఈ మార్పు జరగాలి.. దీనికి కాస్త ఖర్చవుతుంది.. ఇది నిజం.. బట్.. ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా? అని ఎదురుచూసే విపక్షం.. దీనిని అస్త్రంగా మలుచుకుంది.…

Read More

పెద్ద ప్లాన్ లో మల్లారెడ్డి… | Mallareddy in big plan… | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) ఏపీలో బంపర్ మెజార్టీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ. ఈ సారి ఎన్నికల్లో పోటీచేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడింది. దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీకి తెలంగాణంలో డిమాండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్‌లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకోని బీఆర్ఎస్ నేతలకు టీడీపీనే దిక్కులా కనిపిస్తుందంట. అలాంటి వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. సైకిల్ ఎక్కేందుకు ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారంట. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారంట. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారంట. మల్లారెడ్డి…

Read More