మహారాష్ట్రలో హోరా హోరి తప్పదా ముంబై, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) BJP vs Congress ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పట్లో బీజేపీ, శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. శివసేన 56 సీట్లతో రెండో స్థానంలో ఉంది. బీజేపీ-శివసేన కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో ఎన్సీపీ 54 స్థానాలతో మూడో స్థానంలో, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లలో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో అనేక రాజకీయ భూకంపాలు…
Read More