అనంతలో బంజరాలు పండుగ సందడి అనంతపురం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Banjara festival సింధు నాగరికత నుంచి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను.. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు బంజారాలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ తరహాలో గిరిజన తండాలో పల్లెదనం ఉట్టిపడేలా పూర్వీకుల నుంచి వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బంజారాలు హర్యాలీ తీజ్ పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బంజారా కళలను కనుమరుగు కాకుండా వాటికి జీవం పోస్తూ నేటికీ వారి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు. రాను రానూ మారుతున్న కాలానుగుణంగా బంజారాల తీజ్ పండుగను అక్కడక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండాలో ఈ ఉత్సవాలను 11 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన తీజ్ ఉత్సవాలను కన్యలు పండుగ జరపాలని గ్రామ పెద్ద…
Read More