AP Roads : ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు

ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు

ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు విజయవాడ, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అన్నీ అద్వాన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదు. దీంతో రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ నాడు అక్కడకు వెళ్లిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఏపీ రహదారులపై ప్రయాణించడం కష్టమేనని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పటి మంత్రి కేటీఆర్ కూడా ఏపీ రహదారులపై సెటైర్లు వేశారు. తనకు ఆంధ్రకు వెళ్లివచ్చిన మిత్రుడొకరు చెప్పారని, ఏపీ రహదారులపై ప్రయాణించడం నరకమేనని అన్నారన్నారు. తెలంగాణలో రహదారులను చూసి గర్వంగా ఉందని కూడా కేటీఆర్ అన్నారు.. అప్పట్లో ఏపీలో రహదారుల పరిస్థితిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది.…

Read More