Vemireddy Prabhakar Reddy | రగిలిపోతున్న వేమిరెడ్డి… | Eeroju news

రగిలిపోతున్న వేమిరెడ్డి...

రగిలిపోతున్న వేమిరెడ్డి… నెల్లూరు, జనవరి 6, (న్యూస్ పల్స్) Vemireddy Prabhakar Reddy ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గత దశాబ్దకాలంగా చక్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటినుంచి వైసీపీలో కొనసాగుతూ పార్టీకి అండదండ జిల్లాలో తానే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా.. పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ తనవంతు సహకారం అందించి ఆర్థికమగా అండగా నిలిచారు. అటువంటి నేతను పట్టించుకోలేదన్న విమర్శలు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికమయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. ఆయన చెప్పిన వారికి కాదని నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ ని.. జగన్ మరొకరికి కట్టబెట్టారు. దీంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై.. పార్టీకి రాజీనామా చేసి…

Read More

Amaravati | అమరావతిలో లగ్జరీ విల్లాలకు డిమాండ్ | Eeroju news

అమరావతిలో లగ్జరీ విల్లాలకు డిమాండ్

అమరావతిలో లగ్జరీ విల్లాలకు డిమాండ్ గుంటూరు, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Amaravati ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌ క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టడంతో.. భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఎక్కువ మంది లగ్జరీ విల్లాలపై పెట్టుబడి పెడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం.. అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభం కావడమేనని చెబుతున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయి. ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలేదు. కానీ.. గిడిచిన రెండు నెలలుగా భూ క్రయవిక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో భూమి లేని వారు కొత్తగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఏపీ నుంచే కాకుండా…

Read More

Actress Kasturi | తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి… | Eeroju news

తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి...

తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి… తిరుపతి, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Actress Kasturi తమిళనాడులో అధికార డీఎంకే నేతల టార్చర్ భరించలేకపోతున్నానని, తనకు హైదరాబాద్ అభయం ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ తమిళ రాజకీయాలపై మాట్లాడాను, కానీ ఇప్పుడు చెబుతున్నా.. తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. తనను ఎంతగానో ఆదరించిన తెలుగు వారికి తనను దూరం చేయాలన్న ప్రయత్నం జరుగుతుందన్నారు. తెలుగు ప్రజలకు తాను రుణపడి ఉంటున్నానని, ఇక్కడి రాజకీయాల్లోకి వచ్చి వారి కోసం పాటుపడతా అన్నారు. తమిళంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ అడగకుండా తిట్టారని, తెలుగు ప్రజలు మాత్రం మీరు ఇలా అన్నారా, కామెంట్లు చేశారా వివరణ కోరారని.. దటీజ్ తెలుగు ప్రజలు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తాను అభిమానినని, ఆయన దారిలో నడుస్తానని నటి కస్తూర్తి సంచలన…

Read More

Vizianagaram | విజయనగరం బరిలో టీడీపీ నిలిచేనా | Eeroju news

విజయనగరం బరిలో టీడీపీ నిలిచేనా

విజయనగరం బరిలో టీడీపీ నిలిచేనా విజయనగరం, నవంబర్ 6 (న్యూస్ పల్స్)   Vizianagaram విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హతా వేటు వేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. తనపై అనర్హతా వేటు వేయడాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చేసింది. ఈ కారణంగా కోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు కూడా తక్కువేనని భావిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనందున కొనసాగే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికకు పదకొండో తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉంది. 28వ తేదీన పోలింగ్ జరుగుతుంది. విజయనగరం ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు ఎన్నికల సమయంలో టీడీపీలో…

Read More

Amaravati | అతిపెద్ద రైల్వేస్టేషన్ గా అమరావతి | Eeroju news

అతిపెద్ద రైల్వేస్టేషన్ గా అమరావతి

అతిపెద్ద రైల్వేస్టేషన్ గా అమరావతి అమరావతి, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి రైల్వే లైన్‌కు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. 160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వే లైన్ రూపకల్పన జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అలాగే.. అమరావతి రైల్వే స్టేషన్‌లో కోచింగ్ డిపోల వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మెయింటెనెన్స్ కోసం మొదట్లో.. 2-3 పిట్ లైన్లు నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. 1.ఎర్రుపాలెం, అమరావతి నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త సింగిల్‌ లైన్‌ వేయనున్నారు. 2.రూ.2,245 కోట్ల అంచనాతో అమరావతి రైలు ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3.ఈ ప్రాజెక్టులో భాగంగా.. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల…

Read More

Pawan kalyan | పవన్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయినట్టేనా | Eeroju news

పవన్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయినట్టేనా

పవన్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయినట్టేనా అమరావతి, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Pawan kalyan జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలకు ముందు తరహా రాజకీయాలను ప్రారంభించినట్లే కనపడుతుంది. ఫుల్లు ఎఫెన్స్ లో కనపడుతున్నారు. నిన్నటి వరకూ తన పని ఏదో తాను చూసుకుంటూ పవన్ కల్యాణ్ పెద్దగా బయటకు కనిపించలేదు. ఆయన తనకు కేటాయించిన శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలను ఆయన పూర్తిగా అధ్యయనం చేశారు. అధికారులతో సమీక్షలు, ఉత్తర్వులకే పరిమితమైన పవన్ కల్యాణ్ నేడు గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. వచ్చీ రావడంతోనే ఇటు కూటమి ప్రభుత్వంపైనా, అటు విపక్షంపైనా విరుచుకుపడుతూ వెళ్లడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో ఉంటున్న టీడీపీ నేత చేతిలో ఉన్న హోంశాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం…

Read More

Pawan kalyan | పవన్ హాట్ కామెంట్స్ ఆంతర్యం ఏమిటీ | Eeroju news

పవన్ హాట్ కామెంట్స్ ఆంతర్యం ఏమిటీ

పవన్ హాట్ కామెంట్స్ ఆంతర్యం ఏమిటీ కాకినాడ, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Pawan kalyan డిప్యూటీ సీఎంగా ఉంటూ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పవన్ బహిరంగంగా హోం మంత్రికి.. పోలీసులకు సూచనలు చేస్తూనే వార్నింగ్ ఇచ్చారు.ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఆమె రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అసలు పవన్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం టీడీపీ నేతలకు అంతుపట్టడం లేదు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నోటి వెంట అలాంటి మాటలు వచ్చాయంటే.. అవి ఊరికే అనాలోచితంగా రావు.…

Read More

Kurnool | కర్నూలు జిల్లాపై జగన్ దృష్టి | Eeroju news

కర్నూలు జిల్లాపై  జగన్ దృష్టి

కర్నూలు జిల్లాపై  జగన్ దృష్టి కర్నూలు, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Kurnool ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి 12 స్థానాలలో విజయం సాధిస్తే.. ఫ్యాన్ పార్టీ రెండు స్థానాలకే చతికిలపడింది. వై నాట్ 175 టార్గెట్ తో ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ.. ఊపదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నామంటూ లీడర్లు తెగ చెప్పుకొచ్చారు. కానీ ఊహించని రీతిలో ప్రజల తీర్పుతో కంచుకోటలన్నీ బద్దలు అవ్వడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారట పార్టీ అధినేత. నాయకులంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెప్తున్న తరుణంలో.. కార్యకర్తలను అయినా కాపాడుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారట. వైసీపీ…

Read More

YSRCP | వైసీపీలో జమిలీ జపం | Eeroju news

వైసీపీలో జమిలీ జపం

వైసీపీలో జమిలీ జపం తిరుపతి, నవంబర్ 5, (న్యూస్ పల్స్) YSRCP జమిలి ఎన్నికలు వస్తాయంటూ వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారు. 2027 నాటికి జమిలి ఎన్నికలు జరుగుతాయని కార్యకర్తలు అందరూ సమాయత్తం కావాలని వైసీపీ అగ్రనేతలందరూ పిలుపు నిస్తున్నారు. కానీ క్యాడర్ వీరి మాటలను పట్టించుకునే పరిస్థితుల్లో ఉందా? అన్న అనుమానం మాత్రం కలుగుతుంది. 2014లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. 2019 వరకూ అది కొనసాగింది. అయితే 2019 నుంచి 2024 వరకూ జరిగిన జగన్ పాలన తర్వాత క్యాడర్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఉన్న క్యాడర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సొంత సామాజికవర్గం నేతలే వైసీపీ నేతలను విశ్వసించడం లేదు. తొమ్మిది నెలలే లక్ష్యం ఐదేళ్లు దూరంగా పెట్టి… అధికారంలోకి తెచ్చిన క్యాడర్ ను ఐదేళ్ల పాటు పట్టించుకోక…

Read More

Electricity Price Hike | ఏపీలో కరెంట్ షాక్ తప్పదా… | Eeroju news

ఏపీలో కరెంట్ షాక్ తప్పదా...

ఏపీలో కరెంట్ షాక్ తప్పదా… గుంటూరు, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Electricity Price Hike ఏపీ ప్రజలపై విద్యుత్ భారం పడనుంది. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కమ్ లు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలను ఈఆర్సీ బహిర్గతం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 19లోపు అభ్యంతరాలు తెలపాలని కోరింది.ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ కరెంట్ ఛార్జీల షాక్ ఇవ్వనుంది. విద్యుత్ ఛార్జీల పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. అధికార పార్టీలు గత ప్రభుత్వం వైఫల్యం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుందని అంటున్నాయి. ప్రతిపక్ష వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వం బాదుడు మొదలుపెట్టిందని ఆరోపిస్తుంది.ప్రజలకు విద్యుత్ భారం పడనుంది. రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కమ్‌లు రూ. 11,826 కోట్ల…

Read More