కూటమికి కలిసొచ్చిన సమావేశాలు నిలదీసే అవకాశాన్ని వదులుకున్న ప్రతిపక్షం అమరావతి, నవంబర్ 21, (న్యూస్ పల్స్) AP News ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. సభకు వెళ్లినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోతే తమకు మాట్లాడే అవకాశం రాదు కాబట్టి సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వైసీపీ సమావేశాలను బహిష్కరించింది. దీంతో విపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. మండలిలో వైసీపీకి బలం ఉండటంతో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం 11మంది సభ్యులు మాత్రమే గెలుపొందారు. ఎన్డీఏ కూటమి తరపున 164మంది గెలుపొందారు.ఏపీ అసెంబ్లీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు…
Read MoreTag: AP News
Chintakunta Vijaya Ramana Rao | లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే | Eeroju news
లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే – ఘనంగా నృసింహుని రథోత్సవం పెద్దపల్లి Chintakunta Vijaya Ramana Rao మండలంలోని దేవునిపల్లి లక్ష్మి నరసింహ స్వామీ రథోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామణా రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదు రోజుల క్రితం స్వామి వారి కళ్యాణం జరుగగా వరుస కార్యక్రమాలతో లక్ష్మి నృసింహ స్వామికి పలు రకాల విశేష సేవలను పూజారులు చేశారు. కాగా బుధవారం నిర్వహించిన జాతర మహోత్సవంలో పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంతో ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కినట్లు తెలిపారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, గ్రామస్తులు పూర్ణ కుంభంతో ఘనంగా…
Read MoreShashi Tharoor | దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్ | Eeroju news
దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్ తిరువనంతపురం, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Shashi Tharoor దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఇక్కడ విపరీతంగా కాలుష్యం నమోదవుతోంది. చుట్టుపక్కల పరిశ్రమలు.. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు తమ పంట వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల విపరీతంగా కాలుష్యం నమోదవుతున్నది. దీనికి చలి కూడా తోడు కావడంతో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. వృద్ధులు, చిన్నారులు శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ వినూత్న డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. ” ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. గాలి పీల్చడానికి అనువుగా లేకుండా పోతుంది. చాలామంది శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన…
Read MoreSajjala Ramakrishna Reddy | సజ్జలకు కీలక బాధ్యతలు | Eeroju news
సజ్జలకు కీలక బాధ్యతలు దూరంగా సీనియర్ నేతలు విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Sajjala Ramakrishna Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ప్రకటించడం ఆ పార్టీలో కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో ఉంది. 2014లో గెలుస్తామనుకున్న వైసీపీ నేతలు ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ కష్టంలో మొదట జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంటే తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఆయన 2019 ఎన్నికలకు ముందు…
Read MoreYS Jagan | వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్ | Eeroju news
వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్ విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) YS Jagan వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పదకొండు మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని .. అది ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని వైసీపీ సభాపక్ష నేత జగన్ ప్రకటించారు. దాంతో అసెంబ్లీలో విపక్షం లేకుండా పోయింది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ ఉంది. బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. శాసనసభలో కాకకపోయినా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించిన ఆ పార్టీ క్యాడర్ కు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. శాసనమండలిలో వైసీపీకి పూర్తి మజార్టీ ఉంది. టీడీపీకి పది మంది ఎమ్మెల్సీలు ఉంటే.. వైసీపీకి 37 మంది ఉన్నారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందినవారే. ఇలాంటి…
Read MoreNara Lokesh | రాటు తేలుతున్న లోకేష్…. | Eeroju news
రాటు తేలుతున్న లోకేష్…. విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Nara Lokesh టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా పరిణితి చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు తరహాలోనే ఆయన రాజకీయాలను బాగానే ఒంటబట్టించుకున్నారని అర్థమవుతుంది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ లో చాలా వరకూ మార్పు కనిపిస్తుంది. ఇటు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలను చూస్తుంటే లోకేష్ మాత్రం పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఒక రకంగా నారా లోకేష్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ అలవడిందని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. ఒకరకంగా తండ్రి చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా బయటకు కనిపించకపోయినా ముఖ్యమైన నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నవే. స్పీడ్ డెసిషన్…
Read MoreTirumala | 2, 4 గంటల్లో తిరుమలేశుని దర్శనం… సాధ్యమేనా | Eeroju news
2, 4 గంటల్లో తిరుమలేశుని దర్శనం… సాధ్యమేనా తిరుమల, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Tirumala తిరుమలలో సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఇది ఎలా సాధ్యమనే విషయాలు పరిశీలిస్తే.. కంకణం విధానం తిరిగి అమల్లోకి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుని దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వీరికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వ దర్శనం వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు అత్యధికులు సామాన్య భక్తులే. వీరికి పెద్దపీట వేస్తామని టీటీడీ నూతన పాలక మండలి చెబుతోంది. అయితే, రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో…
Read MoreBalineni Srinivasa Reddy | శాసనమండలికి బాలినేని | Eeroju news
శాసనమండలికి బాలినేని ఒంగోలు, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Balineni Srinivasa Reddy ద మొన్న కాంగ్రెస్, నిన్న వైసీపీ, నేడు జనసేన పార్టీ కండువా కప్పుకున్న ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నేనెక్కడున్నా రాజా.. రాజానే అనే రీతిలో ఉంది ఆ నేత పాలిటిక్స్ తంత్రం. ఇంతలా చెప్పాక ఆ నేత ఎవరో చెప్పాల్సిన అవసరం లేదుగా.. ఆయనేనండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయానా మాజీ సీఎం జగన్ కు సమీప బంధువు కూడా. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల మధ్య బాలినేని ఇటీవల జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన బాలినేనికి, ఆదిలో కొంత అవరోధాలు స్వాగతం పలికాయి. కారణం ఒంగోలుకు చెందిన…
Read MoreAP News | సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్సు | Eeroju news
సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్సు నెల్లూరు, నవంబర్ 19, (న్యూస్ పల్స్) AP News ఈనెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు భేటీకానుంది.ఈ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. ప్రత్యేక మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వాలంటీర్లు, 108 ఉద్యోగుల అంశం, పథకాల అమలుపైన నిర్ణయం తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాల నిరోధానికి ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈనెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. సభలో ఆమోదించాల్సిన బిల్లులపైన.. మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందు కోసం కొత్త…
Read MoreKodali Nani | కొడాలి నాని అడ్డంగా బుక్కైనట్టేనా | Eeroju news
కొడాలి నాని అడ్డంగా బుక్కైనట్టేనా విజయవాడ, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Kodali Nani పవర్‌లోకి రాగానే కొడాలి నానిని టార్గెట్ చేసింది కూటమి సర్కార్. విచారణలు, గుడివాడలో అక్రమాలు అంటూ కేసుల వరకు వెళ్లింది వ్యవహారం. అక్కడక్కడ నాని మీద FIRలు కూడా అయ్యాయి. ఏ క్షణంలో అయినా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కారణాలేంటో తెలియదు కానీ..టీడీపీ క్యాడర్, లీడర్ల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా నాని మీద వేగంగా యాక్షన్ తీసుకోలేకపోయింది కూటమి సర్కార్. ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగించే ప్లాన్ జరుగుతోంది.కొడాలి నాని..మీడియా ముందుకు వస్తే చాలు..చంద్రబాబు, లోకేశ్ పేరెత్తితే ఒంటి కాలిపై లేచేవారు. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు. ఇంకో రకంగా చెప్పాలంటే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడటమే స్టైల్‌గా పెట్టుకున్నారనొచ్చు. వైసీపీ హయాంలో…
Read More