అపార నష్టాన్ని మిగిల్చిన వానలు ఏలూరు, జూలై 23 (న్యూస్ పల్స్) The rains caused huge damage ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలం అయ్యాయి. పంట మునకతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం పచ్చగా ఉండే కోనసీమ ప్రాంతమంతా నీటి ముంపులో ఉంది. కాకినాడ ప్రాంతంలో తీర ప్రాంతంలో ప్రజలు సముద్ర కోతతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో ఉన్నారు. రాజమండ్రి ప్రాంతంలోని కడియం వంటి ప్రాంతాల్లో రోడ్లన్ని వాగులను తలపిస్తున్నాయి. నర్సరీలు, ఉద్యాన పంటలు నీటిలోనే ఉన్నాయి. అలాగే వరి పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయికోనసీమ ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉండ్రాజవరం ఎర్ర కాలువ నీరు గట్లు…
Read MoreTag: AP News
How to increase income | ఆదాయం పెంచుకొనేది ఎలా | Eeroju news
ఆదాయం పెంచుకొనేది ఎలా విజయవాడ, జూలై 23 (న్యూస్ పల్స్) How to increase income ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం గత కొన్నేళ్ళుగా తగ్గిపోతోంది. 2014-19 మధ్య అంతంత మాత్రంగా ఉన్న ఆదాయం ఆ తర్వాత గణనీయంగా పడిపోయింది. ఇందులో విధానపరమైన లోపాలతో పాటు పన్ను ఎగవేతలు యథేచ్ఛగా సాగడమే దీనికి ప్రధాన కారణం. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు చెల్లించే పన్నులు, ప్రభుత్వానికి జమ చేసే పన్నుల్లో వ్యత్యాసం పెరిగిపోయింది. కొన్నేళ్ళ క్రితం ఓ ఉద్యోగ సంఘంతో ప్రభుత్వానికి ఘర్షణ వైఖరి ఏర్పడటానికి కారణం కూడా ఇదేననే ప్రచారం ఉంది. పన్నుల వసూళ్లను నేరుగా పర్యవేక్షించే శాఖల్లో కొందరి చేతివాటంతో ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిఎస్టీ వసూళ్లలో ప్రభుత్వానికి- పన్ను చెల్లింపు దారులకు మధ్య వ్యాపారులు…
Read MoreBig planning behind Jagan’s dharna | జగన్ ధర్నా వెనుక బిగ్ ప్లానింగ్ | Eeroju news
జగన్ ధర్నా వెనుక బిగ్ ప్లానింగ్ గుంటూరు, జూలై 23, (న్యూస్ పల్స్) Big planning behind Jagan’s dharna వై నాట్ 175 అంటూ మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కన్న జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కు అర్హులైన ఎమ్మెల్యేలను సైతం గెలిపించుకోలేకపోయారు. ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా టీడీపీ, బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో వైఎస్ఆర్ సీపీని మళ్లీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జగన్ భావిస్తున్నారు. ముందు ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలోనైనా టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే..ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిలో పడాలి. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలి. అంతకన్నా ముఖ్యంగా నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలి. అందుకే ఆ దిశగా జగన్ ముందుకు…
Read MoreTension near AP assembly | ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత | Eeroju news
ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత అమరావతి Tension near AP assembly సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్ద ఉన్న పోస్టర్లను లాక్కొని, చించివేసారు. దాంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. పోస్టర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గుర్తుపెట్టుకో మధుసూదన్ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీకు టోపీ మీద ఉన్న మూడు సింహాలు కి అర్థం అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని అన్నారు. Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news
Read MoreYavvaram in spa centers | స్పా సెంటర్లలో యవ్వారం | Eeroju news
స్పా సెంటర్లలో యవ్వారం ఒంగోలు, జూలై 22 (న్యూస్ పల్స్) Yavvaram in spa centers బయటేమో స్పా, మస్సాజ్ సెంటర్ల బోర్డులు.. లోపలేమో యవ్వారం వేరే.. తనిఖీలకు వెళ్లిన పోలీసులు బిత్తరపోయారు.. ప్రకాశం జిల్లా ఎస్‌పిగా నాలుగురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన దామోదర్ అసాంఘిక కార్యక్రమాలపై తనదైన స్టైల్లో దృష్టి పెట్టారు.. ఒంగోలులో మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఒంగోలు నగరంలో మసాజ్ సెంటర్లు, స్పా క్లినిక్‌ల పేరుతో యువతులతో యువకులకు క్రాస్ జెండర్ మసాజ్‌లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో మొత్తం 16 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేయాలని ఎస్‌పి దామోదర్ పోలీసు సిబ్బందిని అదేశించారు. ఎస్‌పి ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయిన పోలీసులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడుపుతున్న స్పా సెంటర్లపై…
Read MoreJagan is alone in Delhi | ఢిల్లీలో జగన్ ఒంటరి | Eeroju news
ఢిల్లీలో జగన్ ఒంటరి విజయవాడ, జూలై 22 (న్యూస్ పల్స్) Jagan is alone in Delhi ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరిగిపోతున్నాయని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో సమావేశం అయిన ఆయన కలసి వచ్చే పార్టీల మద్దతు కోసం ప్రయత్నించాలని కోరారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి ఢిల్లీలో మద్దతుగా వచ్చే పార్టీలు పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోనహన్ రెడ్డి ఇంత కాలం అనుసరిస్తున్న వ్యూహమే అనుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉన్నారు. మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో నేరుగా ఒక్క సారి కూడా పొత్తులు పెట్టుకోలేదు. ఓ సారి వైసీపీ నేరుగా బీజేపీకి…
Read MoreRice and pulses at affordable prices | సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పు | Eeroju news
సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పు విజయవాడ, జూలై 22 (న్యూస్ పల్స్) Rice and pulses at affordable prices రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని రైతు బజార్లలో, ఉషోదయ, మెట్రో, రిలయన్స్, డిమార్ట్ రిటైల్ దుకాణాలలో సరసమైన ధరలలో నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు జేసీ సంపత్ కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు 7 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల…
Read MoreIs Sunita’s target | సునీత టార్గెట్ పూర్తయినట్టేనా | Eeroju news
సునీత టార్గెట్ పూర్తయినట్టేనా కడప, జూలై 22 (న్యూస్ పల్స్) Is Sunita’s target వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారు. జగన్ ఓటమికి తాను కూడా కొంత కారణమయ్యారని చెప్పకతప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆమె గత నాలుగేళ్లు పెద్ద యుద్ధమే చేశారు. న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు. హత్య కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అలాగే నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని పెద్దయెత్తున పోరాటం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజూ మీడియా సమావేశాలతో హోరెత్తించేవారు. . ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలసి విస్తృతంగా ప్రచారం చేశారు.…
Read MoreChandrababu steps on peace and security | శాంతి భద్రతలుపై ఆచితూచి అడుగులు | Eeroju news
శాంతి భద్రతలుపై ఆచితూచి అడుగులు విజయవాడ, జూలై 22, (న్యూస్ పల్స్) Chandrababu steps on peace and security తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతిభద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయన పథ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడూ ఇలా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను హత్యలు జరగడం వంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు సంక్షేమ పథకాల విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారని గత పాలనను చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. ఎందుకంటే ఒక అత్యాచారం జరిగినా, హత్యజరిగినా వెంటనే ఆయన నేరుగా స్పందించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్…
Read MoreHeated politics in Chandragiri | చంద్రగిరిలో వేడెక్కిన రాజకీయాలు | Eeroju news
చంద్రగిరిలో వేడెక్కిన రాజకీయాలు తిరుపతి, జూలై 22, (న్యూస్ పల్స్) Heated politics in Chandragiri చంద్రగిరిలో వైసీపీ, టీడీపీ పంచాయితీ మరింత ముదురుతోంది. అంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం ఫీక్ స్టేజీకి చేరింది.తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఒకటేలా సాగుతోంది. పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆరోపణలు వార్నింగులు కొనసాగుతున్నాయి. సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు బస్తీమే సవాల్ అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు మీరంటే మీరు…
Read More