వైసీపీకి మరో అగ్ని పరీక్ష విశాఖపట్టణం, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Another fire test for YCP అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండు నెలల్లోనే వైసీపీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతోంది. అదే విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక. జనసేనలో చేరడంతో ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ మీద అనర్హతా వేటు వేశారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన జరుగుతుంది. విశాఖ స్థానిక సంస్థల ఓటర్లలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి.…
Read MoreTag: AP News
Dharmana Brothers | ధర్మాన బ్రదర్స్ రాజకీయ సన్యాసం | Eeroju news
ధర్మాన బ్రదర్స్ రాజకీయ సన్యాసం శ్రీకాకుళం, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Dharmana Brothers శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ధర్మాన సోదరులు పొలిటికల్ రిటైర్మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరపున పోటీ చేసి ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇద్దరూ మంత్రులుగా చేశారు. మొదట ధర్మాన కృష్ణదాసు.. తర్వాత ధర్మాన ప్రసాదరావు మంత్రులుగా చేశారు. ఇద్దరూ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ కారణంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. వారి వారి నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం లేదు. జగన్ తో సమావేశాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కృష్ణదాసు కంటే సీనియర్. ఆయన 1989లో మొదటి సారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా నాలుగు సార్లు గెలిచారు. మూడు…
Read MoreFree sand that has become a farce | ప్రహసనంగా మారిన ఉచిత ఇసుక | Eeroju news
ప్రహసనంగా మారిన ఉచిత ఇసుక గుంటూరు, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Free sand that has become a farce ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా ఇసుక విక్రయాల్లో అమలు చేసిన విధానాలతో నిర్మాణ రంగం కుదేలైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విక్రయాలను నిలిపివేసి ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 43 మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో జనాలకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం దక్కడం లేదు. పట్టణాలు, నగరాల్లో ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం రాలేదు. గత మే నుంచి ఒకే రకమైన ధరలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పాలసీలో ఉన్న లోపభూయిష్టమైన విధానాలే దీనికి అసలు కారణంగా కనిపిస్తోంది. కృష్ణానదికి పొరుగున ఉన్న విజయవాడ వంటి…
Read MoreMeeting with Collectors and SPs | కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం | Eeroju news
కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ప్రాధాన్యాలు, లక్ష్యాలు పై యాక్షన్ ప్లాన్ విజయవాడ, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Meeting with Collectors and SPs ఆగస్ట్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశం ఈనెల 5వ తేది ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రెండో రోజు ఆరో తేదీ కలెక్టర్లతోపాటు పోలీస్ సూపరిండెంట్‌లను కలిపి అడ్రస్ చేయనుంది సర్కార్. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలు వివరించే ఈ కీలక సమావేశానికి కలెక్టర్లు, ఎస్పీలతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కలెక్టర్లతో సమావేశం అవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వాటిని చేరేందుకు అవసరమైన మెకానిజంపై…
Read MoreJanasena MLAs are on duty | జనసేన ఎమ్మెల్యేలే ఆన్ డ్యూటీ | Eeroju news
జనసేన ఎమ్మెల్యేలే ఆన్ డ్యూటీ విజయవాడ, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Janasena MLAs are on duty ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచింది ఆ పార్టీ. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా సరైన విజయం దక్కలేదు. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. రాజకీయ ప్రత్యర్థుల హేళనకు,అవమానాలకు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే గత ఐదేళ్లుగా పార్టీని నిర్మాణాత్మకంగా నడిపి అధికారంలోకి తీసుకు రాగలిగారు పవన్. అయితే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకమైన…
Read MoreChitti Dosha | చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు | Eeroju news
చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు అనంతపురం, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) Chitti Dosha సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు జీతాలు లక్షల్లో ఉంటాయి. అందుకే నేటి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎగబడుతుంటారు. అయితే రోడ్డు పక్కన దోసెలు అమ్ముకునే ఓ మహిళ టెక్కీలే ఆశ్చర్యపోయేలా సంపాదిస్తుంది. రోజుకు రూ.10 వేలు వ్యాపారం చేస్తామని నర్సమ్మ అంటున్నారు. ఇందులో గొప్పేంటి అనుకుంటున్నారా? రోడ్డు పక్కన చిన్న షెడ్డులో మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కాకా హోటల్ నడుపుతూ.. రోజుకు రూ.10 వేల వ్యాపారం చేస్తున్నారంటే…గొప్పే కదా అంటున్నారు స్థానికులు. ఒకరిపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారికి నర్సమ్మ ఆదర్శమే అంటున్నారు. సత్యసాయి జిల్లాలోని కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3…
Read MoreSchool Management Committee Election Schedule | స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ | Eeroju news
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ ఒంగోలు, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) School Management Committee Election Schedule ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఉన్న పేరెంట్స్ కమిటీల స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను నియమించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నిక ఆగస్టు 8న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు. 2021 సెప్టెంబర్ 22న ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను 2023 సెప్టెంబర్ 21తో రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాయి. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే వరకు కొనసాగించారు. ఆగస్టు 8న ఈ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని అన్ని జిల్లాల డీఈఓలు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్స్‌కు రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు.…
Read MoreArogyasree | ఏపీలో ఆరోగ్యశ్రీ పంచాయితీ | Eeroju news
ఏపీలో ఆరోగ్యశ్రీ పంచాయితీ విజయవాడ, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) Arogyasree ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేస్తారని వైసీపీతో పాటు కాంగ్రెస్ కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలే. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ఆయన గుంటూరులో పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ తీసేసి ఆయుష్మాన్ భారత్ ను పెడుతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా షర్మిల కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయని.. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని పెమ్మసాని అంటున్నారని అంటే ఇక ఆరోగ్యశ్రీ లేనట్టేనా అని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఆయుష్మాన్ భారత్ పథకాన్నే అమలు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.…
Read MoreYCP is empty in the kuppam | కుప్పంలో వైసీపీ ఖాళీ | Eeroju news
కుప్పంలో వైసీపీ ఖాళీ తిరుపతి, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) YCP is empty in the kuppam ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కీలక నియోజకవర్గాల్లో ఇంచార్జులు పత్తా లేకండా పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఐదేళ్ల పాటు హవా చెలాయించి గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భరత్ పార్టీని పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కుప్పం రాలేదు. జగన్ తో పాటు ఢిల్లీ ధర్నాకు వెళ్లారు కానీ.. కుప్పంకు మాత్రం రావడం లేదు. హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో జరిగిన అనేక అరాచకాలకు భరతే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడితో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం…
Read MoreCM Chandrababu | ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు | Eeroju news
ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు విజయవాడ, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) CM Chandrababu రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా…తరువాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని…కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.…
Read More