Teachers | దారి తప్పుతున్న టీచర్లు… | Eeroju news

దారి తప్పుతున్న టీచర్లు...

దారి తప్పుతున్న టీచర్లు… అనంతపురం, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Teachers చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులే అప్పులు చేసి పంగ నామం పెట్టి పరార్ అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి.చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులు అప్పులు చేసి జనానికి పంగ నామం పెట్టి పరారతున్నారు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి. తల్లిదండ్రుల తర్వాత అంతటి వారు ఉపాధ్యాయులు… తల్లిదండ్రులు పిల్లల్ని చక్క బెడతారో లేదో తెలియదు కానీ.. ఎంతో మంది పిల్లలకు చక్కటి చదువులు చెప్పి…

Read More

YS Jagan | జగన్ బలం..బలగం ఎక్కడ… | Eeroju news

జగన్ బలం..బలగం ఎక్కడ...

జగన్ బలం..బలగం ఎక్కడ… విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) YS Jagan నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోగానే ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో, మండలిలో, ఇటు లోక్ సభ, రాజ్యసభలో కావాల్సినంత బలం ఉండేది. వాటితో ఎవరిపై ఆధారపడకుండానే సొంతంగానే చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉండేది.ఒకవైపు రాష్ట్రంలో శాసనసభ రూపొందించే చట్టాల్లో ఆ పార్టీదే ముఖ్యపాత్ర ఉండేది. మరోవైపు పార్లమెంటులోనూ వైసీపీది చెప్పుకునే స్థాయి పాత్రే. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. వైఎస్ జగన్ పార్టీ ప్రాధాన్యం లేకుండానే కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో బిల్లులు పాస్ కానున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11…

Read More

Amaravati | అమరావతికి నిధుల వరదే | Eeroju news

అమరావతికి నిధుల వరదే

అమరావతికి నిధుల వరదే విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణంపై తీపికబురు అందింది. ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు ఊతమిచ్చేలా ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్ కన్సార్షియం నుంచి కేంద్ర ప్రభుత్వ హామీతో రుణాన్ని మంజూరు చేయడానికి సమ్మతి తెలిపాయి. గత ఐదేళ్లుగా అమరావతి పనులు నిలిచిపోవడంతో పాటు అంతకు ముందు చేపట్టిన పనులకు సంబంధించి దాదాపు రూ.9వేల కోట్ల మేర బిల్లులు బకాయి చెల్లించాల్సి ఉంది.2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి అమరావతి పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనుల పునురుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి నిధులు గ్యారంటీగా ఇస్తామని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. గతంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకులు అమరావతి నిర్మాణానికి రుణాలు…

Read More

Nara Lokesh | లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం… | Eeroju news

లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం...

లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం… గుంటూరు, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Nara Lokesh నారా లోకేష్ పై కీలక బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యత పెరిగింది. అటు ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నవేళ లోకేష్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున వీలైనంతవరకు.. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులు సైతం సమన్వయం చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీ వెళ్లి పెద్దలను కూడా కలిశారు. అయితే ఇదంతా పక్క వ్యూహంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంపై చర్చించడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు…

Read More

CID notice to TDP leader Kolikapudi | కొలికపూడికి నోటీసులు… | Eeroju news

కొలికపూడికి నోటీసులు...

కొలికపూడికి నోటీసులు… విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) CID notice to TDP leader Kolikapudi టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతి ఉద్యమ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గత ఐదేళ్లుగా గట్టిగానే వాయిస్ వినిపించారు. అందుకే చంద్రబాబు పిలిచి మరి తిరువూరు టికెట్ కేటాయించారు. ఆయన గెలుపు కష్టమని అంతా భావించారు. కానీ టిడిపి తో పాటు కూటమి సమన్వయంతో పనిచేయడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తన గెలుపునకు కృషి చేసిన సొంత పార్టీ శ్రేణులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొలికపూడి. ఇలా గెలిచారో లేదో యంత్రాలతో సిద్ధమయ్యారు. ఓ వైసీపీ నేత ఇంటిని నేలమట్టం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. అంతటితో…

Read More

Dharmavaram Panchayat | తెగని ధర్మవరం పంచాయితీ….. | Eeroju news

తెగని ధర్మవరం పంచాయితీ.....

తెగని ధర్మవరం పంచాయితీ….. అనంతపురం, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Dharmavaram Panchayat ధర్మవరం.. ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు కేరాఫ్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్‌ ఇష్యూతో ధర్మవరంలో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లిఖార్జునను తీసుకురావడం..లోకల్‌ టీడీపీ క్యాడర్‌కు..లీడర్లకు నచ్చడం లేదు. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి సత్యకుమారే మల్లిఖార్జునను తిరిగి మున్సిపల్‌ కమిషనర్‌గా తెచ్చారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.ప్రస్తుత ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌ మల్లిఖార్జున..గత వైసీపీ హయాంలో కూడా మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలకు మల్లిఖార్జున అండగా నిలిచారని..మున్సిపల్ కమిషనర్‌ సహకారంతో కేతిరెడ్డి రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మల్లిఖార్జున తమను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆగ్రహంతో ఉంది టీడీపీ క్యాడర్.వైసీపీ కండువా కప్పుకుంటేనే పనులు చేసి పెడతానని హింసించారని…

Read More

Janasena in Plan B | ప్లాన్ బీలో జనసేన… | Eeroju news

ప్లాన్ బీలో జనసేన...

ప్లాన్ బీలో జనసేన… విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Janasena in Plan B ఏపీలో జనసేన పార్టీ రోజురోజుకు బలోపేతమవుతోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ క్యాడర్ ను పెంచుకోవడంలో జనసేన ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఏపీలో కూటమి విజయంలో జనసేనదే కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు కృతజ్ఞతగా.. సీఎం చంద్రబాబు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే పాలనా పరమైన అంశాలపై దృష్టి సారించిన పవన్.. పార్టీ క్యాడర్ బలోపేతం చేసుకొనేందుకు కూడా కసరత్తు ప్రారంభించారనే చెప్పవచ్చు. అందులో భాగంగా ఇటీవల పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరగా.. వారిని సాదరంగా ఆహ్వానించారు పవన్. ఇప్పటికే బీజేపీ మద్దతు గల జనసేన పార్టీ క్యాడర్…

Read More

Kodali Nani VS Vallabhaneni | లైట్ తీసుకున్న కొడాలి… వల్లభనేని | Eeroju news

Kodali Nani VS Vallabhaneni

లైట్ తీసుకున్న కొడాలి… వల్లభనేని విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Kodali Nani VS Vallabhaneni శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీని కుదిపేస్తుంది. అసలే ఓటమి భారం ఒకవైపు.. మరోవైపు కీలక నేతల వలసలతో కుంగిపోతున్న ఆ పార్టీ తిరుమల వ్యవహారంలో తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి నానా పాట్లు పడుతుంది. దానిపై రెండు సార్లు మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్ తాను క్రిస్టియన్‌నని ఒప్పుకున్నారు. తిరుమలకు వస్తానని ప్రకటించిన ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడక ఏవేవో కారణాలు చెప్పి ఆ యాత్రను కాన్సిల్ చేసుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు.. అయితే ఆయనకు వీరవిధేయులే దాన్ని పాటించకపోవడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ వివాదం వ్యవహారం ముదురుతూ…

Read More

Governing Council after Brahmotsavam | బ్రహ్మోత్సవాల తర్వాతే పాలక మండలి..? | Eeroju news

బ్రహ్మోత్సవాల తర్వాతే పాలక మండలి

బ్రహ్మోత్సవాల తర్వాతే పాలక మండలి..? తిరుమల, అక్టోబరు 1 , (న్యూస్ పల్స్) Governing Council after Brahmotsavam ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలై వారం గడుస్తోంది. గత వారం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, పాలక మండలి సభ్యుల్నినియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నాయకులు, పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి అనుభవం, సామర్థ్యానికి తగ్గ పోస్టుల్లో నియమించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, కీలకమైన పదవుల నియామకంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం గుర్తింపు ఉన్న పదవుల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ పదవిపై ఉత్కంఠ వీడటం లేదు. గత వారమే టీటీడీ ఛైర్మన్ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుందని విస్తృతంగా ప్రచారం…

Read More

Vijayasai Reddy | టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి…? | Eeroju news

టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి

టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి…? విశాఖపట్టణం, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Vijayasai Reddy వైసీపీని వలసలు కుదిపేస్తున్నాయి. పేరున్న నాయకులంతా ఒకరొకరుగా జగన్‌కు గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు. జగన్‌కు సన్నిహితులుగా పేరున్న మాజీ మంత్రులు కూడా పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానిక సంస్థల్లో ఆధిక్యం ఉన్న ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజ్యసభ సభ సభ్యులు కూడా జగన‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి టీడీపీలో చేరడానికి ప్రయత్నించారని అచ్చెన్నాయుడు వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది.ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,…

Read More