లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? అమరావతి, Amaravati తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో జరిగిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ, సిట్, అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటికే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఆపేసింది. దాంతో కొత్త సిట్ ను వెంటనే నియమిస్తారని, విచారణ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ సిట్ నియామకంపై ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. సిట్ నియామకం, విచారణపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు పెట్టకపోవడంతో నింపాదిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు అయ్యేలోపు నియమించే అవకాశం ఉంది. సీబీఐ చీఫ్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు ఏపీలోని సిట్ బృందంలో ఉన్న వారు. ఒక అధికారిని ఖరారు చేయాల్సి ఉంది. వీరిని ప్రకటిస్తే, దర్యాప్తు వేగంగా జరిగే…
Read MoreTag: AP News
AP Liquor | ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్.. | Eeroju news
ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్.. అమరావతి అక్టోబర్ 14 AP Liquor ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నారు. దరఖాస్తుకు శుక్రవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. శుక్రవారం ఒకే రోజు 20వేల వరకు దరఖాస్తులు రావచ్చని అంచనా. దాంతో ప్రభుత్వానికి రూ.1600కోట్లకుపైగానే ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటి వరకు ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు 4,839 మంది.. అల్లూరి జిల్లాలో 40 మద్యం దుకాణాలకు 869 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.అయితే, అమెరికా, యూరప్ నుంచి సైతం పలువురు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు…
Read MorePawan Kalyan | పవన్ పేరుతోనే దందా.. | Eeroju news
పవన్ పేరుతోనే దందా.. కాకినాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Pawan Kalyan అధికారంలో ఉన్నవారి పేర్లు చెప్పుకుని వారితో దిగిన ఫోటోలు చూపించి బయట మోసాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జిల్లా స్థాయి అధికారి ఒకరు అదే పని చేయడం చర్చనీయాంశమయింది. కాకినాడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా రవీంధ్రనాథ్ రెడ్డి అనే అధికారి బదిలీపై వచ్చారు. వచ్చీ రావడంతో ఆయన పవన్ కల్యాణ్‌కు తాను అత్యంత సన్నిహితుడినని ఆయన సిఫారసుతోనే వచ్చానని చెప్పి జిల్లా మొత్తం మైనింగ్, అటవీశాఖ అధికారులు సహా పలువురు వ్యాపారుల్ని బెదిరించడం ప్రారంభించారు. ఆయన ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో కొంత మంది అధికారులు విషయాన్ని డిప్యూటీ సీఎం పేషీ దృష్టికి తీసుకెళ్లారు. పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట – టీవీ ఇంటర్యూల్లో హల్చల్…
Read MoreNTR And Pawan | ఎన్టీఆర్ తరహాలో పవన్ | Eeroju news
ఎన్టీఆర్ తరహాలో పవన్ విజయవాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) NTR And Pawan జనసేన అధినేత పవన్ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారికి ఆయన ఒక రోల్ మోడల్ గా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటులు పవన్ కళ్యాణ్ ను కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విలక్షణ నటుడు షియాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ ను షిండే కలిశారు. కీలక చర్చలు జరిపారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షకు మద్దతు తెలిపారు. ఆలయాల్లో దేవుడి దర్శనం చేసుకునే భక్తులకు మొక్కలు ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టారు. మహారాష్ట్రలో తాను ఓ 3 ఆలయాల్లో అదేవిధంగా మొక్కలు అందించిన విషయాన్ని పవన్…
Read MoreJagan | బీజేపీకి దూరంగా జగన్ | Eeroju news
బీజేపీకి దూరంగా జగన్ విజయవాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Jagan వైఎస్ జగన్ ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. బీజేపీ వాడుకుని వదిలేసే రకం అన్న నిర్ణయానికి వచ్చారు. నాడు చంద్రబాబు, నేడు తాను బీజేపీ దెబ్బకు బలయిపోయానని వైఎస్ జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన స్వరం ఇటీవల కాలంలో మారుతుంది. ఆయనతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి బీజేపికి దూరమవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లే కనపడుతుంది. జగన్ మాటలను బట్టి అది సులువుగా అర్థమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు అన్యాయం చేసిందన్న ధోరణిలో జగన్ ఉన్నారు. నిజానికి జగన్ ఎప్పుడూ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. అలాగని వ్యతిరేకించలేదు. 2014లో జగన్ ను…
Read MoreAP Roads PPP Model | పీపీపీలో రోడ్ల నిర్మాణం… | Eeroju news
పీపీపీలో రోడ్ల నిర్మాణం… విజయవాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) AP Roads PPP Model ఏపీలో రోడ్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ మోడల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు 100 రోజుల ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రణాళికను ఖరారు చేసి రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందిరాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో జరగనున్నాయి. దీని కార్యాచరణ ఖరారు చేయడానికి ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీ కార్యాచరణను ఖరారు చేసి రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల డిపార్టమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.రోడ్లు, భవనాలు (ఆర్అండ్‌బీ) డిపార్ట్‌మెంట్, ఏపీ రోడ్డు…
Read MoreCM Chandra babu | ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం | Eeroju news
ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం సీఎం చంద్రబాబు అమరావతి, CM Chandra babu ఏపీలో నడికుడి శ్రీకాళహస్తి కోటిపల్లి నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027లోగా బుల్లెట్ రైలుపనులు ప్రారంభం కావొచ్చు. ఐటీ లిటరసీ,డిజిటల్ హబ్ పెట్టాలని కేంద్రాన్ని కోరాం డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని కోరాం. క్లౌడ్ ఉన్న నాలెడ్జ్ ను పూర్తిగా వినియోగించుకుంటాం అని సీఎం చంద్రబాబు వివరించారు. Chandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
Read MoreAP Wine Shop Tenders | లిక్కర్ షాపులపై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మక్కువ | Eeroju news
లిక్కర్ షాపులపై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మక్కువ ఏలూరు, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) AP Wine Shop Tenders ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా లిక్కర్ గురించే డిస్కషన్ నడుస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎక్కడ నలుగురు కలిసినా వైన్ షాపుల గురించే మాట్లాడుకుంటున్నారు. లిక్కర్ బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు టెండర్లు వేస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో.. యువత వాటిని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. మరోవైపు సాఫ్ట్…
Read MoreAmaravati | అమరావతిలో కనిపించని రియల్ బూమ్ | Eeroju news
అమరావతిలో కనిపించని రియల్ బూమ్ విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Amaravati ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగానికి కూటమి ప్రభుత్వంలో కూడా ఒడిదుడుకులు తప్పడం లేదు. రాజధాని నిర్మాణంపై జరిగిన రాద్ధాంతం ఏపీ రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచినా ఇంకా మార్కెట్‌పై నమ్మకం రావట్లేదు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందోననే ఆందోళన నిర్మాణ రంగాన్ని వేధిస్తోంది.ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ రంగం 2020 నుంచి తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తోంది. 2019లో ఇసుక తవ్వకాలపై నిషేధంతో మొదలైన ప్రతిష్టంభన మూడు రాజధానుల ప్రకటన తర్వాత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. క్రమబద్దమైన అభివృద్ధి, స్థలాల కొరత కారణంగా చిన్న పట్టణాలు మొదలుకుని, పది లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలు, పదిలక్షల జనాభాకు పైబడిన…
Read MoreNagababu | పెద్దల సభకు నాగబాబు | Eeroju news
పెద్దల సభకు నాగబాబు విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Nagababu ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కూటమి నేతలు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి జనసేన..రెండు టీడీపీకి దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో రాజ్యసభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసారు. దాంతో రాజ్యసభలో 11 మంది…
Read More