సరస్వతి భూముల్లో సర్వే గుంటూరు, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Deputy CM orders Probe into Lands of Saraswati Power డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు కదిలారు. జగన్ కంపెనీ సరస్వతి పవర్ భూముల్లో సర్వే నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో.. అధికారులు శనివారం సర్వే చేపట్టారు. సరస్వతి భూములపై పవన్ కళ్యాణ్ అధికారులను సమగ్ర నివేదిక కోరారు.పల్నాడు జిల్లాలోని సరస్వతి భూముల్లో అధికారులు సర్వే నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం కదిలింది. దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది సర్వే చేపట్టారు. సరస్వతి సిమెంట్ భూముల్లో.. అటవీ భూముల వివరాలను పవన్ కళ్యాణ్ అడిగారు. సమగ్ర నివేదిక కోరారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి సర్వే చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్…
Read MoreTag: AP News
Registration Charges | డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు | Eeroju news
డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు కాకినాడ, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Registration Charges ఏపీలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10 నుచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. సాధారణంగా పట్టణాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తుంటారు. తాజాగా కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయాలని నిర్ణయించింది. భూముల బహిరంగ మార్కెట్ విలువ, స్థానిక అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర…
Read MoreAmaravati | ఇక అమరావతి మాములుగా లేదుగా | Eeroju news
ఇక అమరావతి మాములుగా లేదుగా విజయవాడ, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Amaravati ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అమరావతికి మించి మరే ప్రయారిటీ లేదు. దానిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఐదేళ్లలో అమరావతిని ఒక దశకు తేవాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తుంది. అమరావతి తర్వాతే ఆయనకు ఏదైనా.. అలా ముందుకు సాగుతున్నారు. అమరావతిలో పనులు పరుగులు పెట్టించాలన్న భావనతో ఉన్న చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రపంచ బ్యాంకు నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు అవుతాయని చెప్పడంతో ఇక టెండర్లను పిలిచేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమయింది. అందుకు సీఆర్డీఏ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 36 కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిలో చెట్లను తొలగించారు. ముళ్లపొదలన్నింటినీ క్లియర్ చేసేసి క్లీన్ అండ్…
Read MoreYs Vijayamma | విజయమ్మ ఎటూ… | Eeroju news
విజయమ్మ ఎటూ… విజయవాడ, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Ys Vijayamma వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం రచ్చ రచ్చగా మారింది. రోడ్డు మీదకు ఎక్కింది. రాజకీయంగా చర్చకు దారి తీసింది. కుటుంబాల గొడవ ఎందుకని జగన్ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం గొడవ కాదని, ఒక తల్లి, చెల్లికి జరిగిన అన్యాయం అంటూ అధికార పక్షం వాదిస్తుంది. ఇటు వైఎస్ షర్మిల రోజుకో లేఖలను విడుదల చేస్తున్నారు. జగన్ తరుపున మీడియా సమావేశాలు పెట్టి వైఎస్ షర్మిల పైన, చంద్రబాబుపైన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ ఓటమి పాలయి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆస్తుల వివాదం నిజంగానే జగన్ కు తలనొప్పిగా మారింది. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు లేవని స్పస్టంగా అర్థమయింది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా…
Read MoreSrisailam | శ్రీశైలం జలాశయానికి వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత | Eeroju news
శ్రీశైలం జలాశయానికి వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత శ్రీశైలం అక్టోబర్ 26 Srisailam శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత నీటిని కిందకు వదులుతున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,17,326 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,22,874 క్యూసెక్కులుగా ఉంది. ఇక, ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరుకుంది. మరోవైపు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. Srisailam is like a full pot..Ten gates are lifted and water is released | నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల | Eeroju news
Read MoreBotsa Satyanarayana | సత్తిబాబు దూరం అవుతున్నారా.. | Eeroju news
సత్తిబాబు దూరం అవుతున్నారా.. విశాఖపట్టణం, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Botsa Satyanarayana ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సామాజికపరంగా, ఆర్థికంగా ఆయన బలమైన నేత. ఉత్తరాంధ్రలో ఆయన మోస్ట్ సీనియర్ మాత్రమే కాదు.. ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన బొత్స సత్యనారాయణ వైసీపీ హైకమాండ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు రుచించడం లేదా? అన్న ప్రశ్నకు నిన్నటి జగన్ విజయనగరం జిల్లా పర్యటన స్పష‌్టం చేస్తుంది. ఎందుకంటే తన సొంత జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వస్తే బొత్స సత్యనారాయణ మాత్రం హాజరు కాలేదు. ఎక్కడా ఆయన టూర్ లో కనిపించలేదు. గొర్ల గ్రామంలో పర్యటించిన జగన్ డయేరియా బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కనీసం…
Read MoreBalineni Srinivasa Reddy | బాలినేని… వాట్ నెక్స్ట్ | Eeroju news
బాలినేని… వాట్ నెక్స్ట్ ఒంగోలు, అక్టోబరు 26, (న్యూస్ పల్స) Balineni Srinivasa Reddy సైలెంట్ రాజకీయాలకు స్పెషల్ ఆ జిల్లా. ఎప్పుడు ఈ జిల్లా రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇక్కడి నాయకుల రాజకీయ ఎత్తుగడలే. ఇటీవల ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. సైలెంట్ పాలిటిక్స్ తో షేక్ చేశారు.ఏపీలోని ప్రకాశం జిల్లా పాలిటిక్స్ అంతా డిఫరెంట్. ఇక్కడి నేతల్లో కొందరి వ్యవహార శైలి చాలా సైలెంట్ గా ఉంటుంది. కానీ వారిచ్చే షాకులు మాత్రం చాలా వైలెంట్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఇటీవల ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి చేరడం కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిదే. వైసీపీ లో నేనే రాజు..…
Read MoreSocial Media War In AP | ఏపీలో సోషల్ మీడియా వార్… | Eeroju news
ఏపీలో సోషల్ మీడియా వార్… నెల్లూరు, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Social Media War In AP ఏపీలో సోషల్ మీడియా వార్ పీక్ లెవల్‌లో కొనసాగుతోంది. అటు టీడీపీ..ఇటు వైసీపీ వరుస పెట్టి..పోటాపోటీ పోస్టర్లు, ట్వీట్లతో బ్లాస్టింగ్ న్యూస్ అంటూ ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ టీమ్ చంద్రబాబు, లోకేశ్‌ను టార్గెట్ చేస్తే టీడీపీ సోషల్ మీడియా..జగన్‌ను, ఆయన కోటరీని రౌండప్ చేస్తోంది. దీంతో పోటాపోటీ పోస్టులు, ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎన్నికలు అయిపోయాయి. టీడీపీ పవర్‌లోకి వచ్చి ఐదు నెలలు కావొస్తోంది. మళ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకో నాలుగేళ్లు అయితే పడుతుంది. కానీ ఏపీలో మాత్రం రేపే ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా టీడీపీ వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా వార్ హీటెక్కుతోంది. పవర్‌లో ఉన్న టీడీపీ..అపోజిషన్‌లో ఉన్న వైసీపీ ఎవరూ తగ్గడం లేదు. అధినేత…
Read MoreSarada Peetham | శారదా పీఠం..అక్రమాల పుట్ట | Eeroju news
శారదా పీఠం..అక్రమాల పుట్ట విశాఖపట్టణం, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Sarada Peetham శారదాపీఠం.. పేరుకే పీఠం కానీ వివాదాల పుట్ట అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పీఠం చెప్పేదొకటి, తీరా చేసేది ఇంకొకటి. ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కో రకంగా ఉంటూ వత్తాసు పలకడం, సర్కారు కేటాయించిన భూములను వాణిజ్యపరంగా వాడుకోవడం పరిపాటిగా వస్తోంది. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిందే తడవుగా, అది ఏదైనా సరే ఇష్టానుసారం ఇచ్చేశారని ఆరోపణలు కోకొల్లలు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత శారదాపీఠానికి వరుస షాక్‌లు ఇస్తోంది. అటు విశాఖపట్నంలో, ఇటు తిరుమలలో కేటాయించిన భూములును రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకున్నది. వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి ఈ…
Read MoreAP free gas bookings | ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం | Eeroju news
ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం విజయవాడ, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) AP free gas bookings ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం దీపావళి ధమాకా వార్త చెప్పింది. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ పథకం బుకింగ్స్ ప్రారంభమవుతందన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని అన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండి… తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబం అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. గ్యాస్ సిలిండర్ అందిన వెంటనే మీరు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ప్రభుత్వం తిరిగి డీబీటీ ద్వారా నగదు వెనక్కి ఇచ్చేస్తుందన్నారు. ఏమైనా ఇబ్బందులు…
Read More