ఇంటర్ పరీక్షలకు అంతా సిద్ధం విజయవాడ, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు అంతా సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డు జారీ చేసింది. హాల్‌టికెట్లను విద్యార్థులే నేరుగా ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ పర్యాయం…
Read More