విద్యాదీవెన పథకానికి గ్రీన్ సిగ్నల్ నెల్లూరు, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన పథకాలను త్వరలో పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. దళితులకు రద్దు చేసిన పథకాలను పునరుద్దరించనున్నట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయులు ప్రకటించారు.రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి పునరుద్దరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని, రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామాన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో…
Read MoreTag: ap government schemes
సీఎం చెప్పినా వినరా_ కనిపించని ఆన్ లైన్ సేవలు
సీఎం చెప్పినా వినరా_కనిపించని ఆన్ లైన్ సేవలు అనంతపురం, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్) ఏపీలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలి… ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి, ధృవ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా పౌరసేవల్లో మాత్రం మార్పు రావడం లేదు.డిజిటల్ పౌరసేవల్లో దేశానికే ఒకప్పుడు తలమానికంగా వ్యవహరించిన రాష్ట్రంలో ఇప్పడు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలవరీ వ్యవస్థ పడకేసింది. గ్రామ వార్డు సచివాలయాలతో పౌరసేవల్ని అందించిన తర్వాత కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు పరిస్థితి తయారైంది.వాట్సాప్‌లోనే ప్రజలు నేరుగా డిజిటల్ ధృవీకరణలు పొందేలా టెక్నాలజీని అభిృవృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నా పౌర సేవల్లో నాణ్యత మాత్రం మెరుగు పడటం లేదు. రెవిన్యూ శాఖ ద్వారా అందించే పౌర సేవల్ని…
Read MoreAP | న్యూ ఇయర్ హామీలకు లైన్ క్లియర్
AP | న్యూ ఇయర్ హామీలకు లైన్ క్లియర్ విజయవాడ, డిసెంబర్ 5, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టడం లేదు. సంక్షేమాన్ని కూడా సమపాళ్లలో జరపాలన్న నిర్ణయానికి వచ్చారు. నిధులు పెద్దగా అందుబాటులో లేకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా వ్యవహరించడం, మద్దతుగా నిలుస్తుండం చంద్రబాబు ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా చూడాలి. రుణాల విషయంలోనూ, నిధుల మంజూరులోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎక్కువగా రాష్ట్రానికి విడుదల చేయడంలోనూ ఢిల్లీ పెద్దలసు సహకరిస్తుండటంతో చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నాలుగు వేల రూపాయలు నెలకు పింఛను ఇస్తున్నారు. దివ్యాంగులకు ఆరువేల రూపాయల పింఛను నెలకు…
Read More