Yanamala Ramakrishnudu : యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా

Yanamala Ramakrishnudu

యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా కాకినాడ, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్ గా లేరని అర్థమవుతుంది. ఆయన అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయినట్లే కనిపిస్తుంది. అందుకే యనమల నేరుగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతూ లేఖ రాశారని తెలుగుదేశం పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. యనమల చేసిన పనికి ఆయన సొంత జిల్లాకు చెందిన, టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం అభ్యంతరం తెలిపారంటే.. అది ఆయనకంటూ చేయలేదన్నది సుస్పష్టం. పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే రెడ్డి సుబ్రహ్మణ్యం యనమలపై విమర్శలకు దిగారని అనుకోవచ్చు. చంద్రబాబు కూడా యనమల చేసిన పనిని సులువుగా తీసుకోవడం లేదు. దీనిపై సీరియస్ గానే ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిసింది. అలాగే యనమల…

Read More

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం   గుంటూరు, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో పెన్ష‌న్ల‌పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. అన‌ర్హ‌ుల పెన్ష‌న్లు ఏరివేత‌కు రంగం సిద్ధ‌మైంది. పెన్ష‌న్లను త‌నిఖీ చేసేందుకు పైల‌ట్ ప్రాజెక్ట్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగు ముందుకేసింది. పైల‌ట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కొ స‌చివాల‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు.పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హుల ఏరివేతకు ముందడుగు వేసింది. ఈ మేరకు సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జి.వీరపాండియన్ స‌ర్క్యూల‌ర్ జారీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పెన్షనర్లను వెరిఫికేష‌న్ చేయ‌నున్నట్లు స్పష్టం చేశారు. పెన్ష‌న‌ర్ల వాస్తవ అర్హత స్థితిని నిర్ధారించడానికి పైలట్ ప్రాతిపదికన.. ఒక గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో పెన్షన్‌ల ధృవీకరణ చేయ‌నున్న‌ట్లు వివరించారు.స‌మాజంలోని అన్ని విభాగాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరపాండియన్…

Read More

పవన్ కల్యాణ్ దూకుడే బలం… బలహీనతగా మారకుండా చూసుకోవాలి

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. త్యాగాలకు సిద్ధమయి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ధ్యేయమని చెప్పిన పవన్ కల్యాణ్ అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు. కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు. కాకినాడ, డిసెంబర్ 7, (న్యూస్ పల్స్) జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. త్యాగాలకు సిద్ధమయి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ధ్యేయమని చెప్పిన పవన్ కల్యాణ్ అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు. కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు. రాష్ట్రంలో మంత్రి పదవులు ఇన్ని ఇచ్చారన్న అసంతృప్తి ఎంత మాత్రం లేదు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోనే పవన్ కల్యాణ్…

Read More

సీఎం చెప్పినా వినరా_ కనిపించని ఆన్ లైన్ సేవలు

TDP Leader Chandrababu naidu

సీఎం చెప్పినా వినరా_కనిపించని ఆన్ లైన్ సేవలు   అనంతపురం, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్) ఏపీలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలి… ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి, ధృవ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా పౌరసేవల్లో మాత్రం మార్పు రావడం లేదు.డిజిటల్‌ పౌరసేవల్లో దేశానికే ఒకప్పుడు తలమానికంగా వ్యవహరించిన రాష్ట్రంలో ఇప్పడు ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్ డెలవరీ వ్యవస్థ పడకేసింది. గ్రామ వార్డు సచివాలయాలతో పౌరసేవల్ని అందించిన తర్వాత కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు పరిస్థితి తయారైంది.వాట్సాప్‌లోనే ప్రజలు నేరుగా డిజిటల్ ధృవీకరణలు పొందేలా టెక్నాలజీని అభిృవృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నా పౌర సేవల్లో నాణ్యత మాత్రం మెరుగు పడటం లేదు. రెవిన్యూ శాఖ ద్వారా అందించే పౌర సేవల్ని…

Read More

రైస్ దందా మాటున కధలెన్నో…

నౌకలో వెళ్లి తనిఖీలు చేస్తోన్న కలెక్టర్‌

రైస్ దందా మాటున కధలెన్నో…   కాకినాడ, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్) కాకినాడ పోర్టు నుంచి రేషన్ దందాపై రోజుకో నిజం వెలుగులోకి వస్తోంది. కొద్దిరోజుల కిందట సౌత్ ఆఫ్రికా కు రేషన్ బియ్యం తో వెళ్తున్న షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పి సీజ్ చేశారు. అటు తరువాత నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ఆ షిప్ ను పరిశీలించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రం దందాను ఉక్కు పాదంతో అణచివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో వైసిపి ఎదురుదాడి చేస్తోంది. బియ్యం దందాలో టిడిపి నేతల సమీప బంధువులు ఉన్నారని…

Read More