– పందెం కోళ్లకు డిమాండ్ షురూ… ఏలూరు, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) సంక్రాంతి అంటేనే కోడిపందేలు… కోడి పందేలు అంటే సంక్రాంతి.. అలా వుంటుంది క్రేజ్.. ఏపీలో.. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సంక్రాంతి హడావిడిగురించి ఎంత చెప్పినా తక్కువే.. పండగ మూడు రోజులు కోడిపందేల జోష్ ఇక్కడి ప్రజలను ఊపేస్తుంది..కోడిపందేల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. గోదావరి జిల్లాలకే ప్రత్యేకత తెచ్చిన కోడి పందేలకు కోళ్లు సిద్ధమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇప్పటికే రైలు, బస్సు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకున్నారు. ఇక పందెం రాయుళ్లు హడావిడి కూడా పండుగ ముందు నుంచే మొదలైంది మరో రెండువారాలు దాటితే….కోడిపుంజులను కొనేందుకు ఎగబడతారు పందెం రాయుళ్లు. కండబట్టి పందేనికి సిద్ధంగా ఉన్న ఒక్కో కోడి పుంజు ధర 50 వేల…
Read More