సియం ముఖ్య కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యం.రవిచంద్ర | Ym. Ravichandra took office as the chief secretary of CM | Eeroju news

అమరావతి,13 జూన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా యం.రవిచంద్ర గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈమేరకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో ఆయన సియం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు దివ్య ఆశిస్సులు అందించారు.అనంతరం పలువురు అధికారులు,సిబ్బంది రవిచంద్రకు పుచ్చ గుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.అంతకు ముందు టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న,గుంటురు జిల్లా కలక్టర్ యం.వేణు గోపాల్ రెడ్డి,ఎస్పి తుషార్ గూడి,న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్,ప్రోటోకాల్ డైరక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి,సచివాలయ వివిధ విభాగాల అధికారులు,సిబ్బంది,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More

అమరావతిలో భూముల ధరలకు రెక్కలు | Wings for land prices in Amaravati | Eeroju news

విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత అయిదేళ్లుగా చతికిలపడిన భూముల రేట్లు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రాజధాని ఆశలతో తిరిగి పుంజుకున్నాయి.  నిజం చెప్పాలంటే 2023 డిసెంబరు నెల నుంచే  తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి కానున్నారనే టాక్ రావడంతో నిర్జీవమైన భూముల ధరల్లో చలనం కనిపించింది. మూడు రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం తెరపైకి తేవడంతో..  ఏపీ రాజధాని అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు దాదాపు నాలుగేళ్లపాటు నేల చూపులు చూశాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికొచ్చాయి. భూములు కొనుగోళ్ల పరిస్థితి అటుంచితే.. కనీసం అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని నెలల నుంచి పరిస్థితిలో మార్పు కనిపించింది. వైసీపీ…

Read More

చిరంజీవి, పవన్‌ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం | Chiranjeevi and Pawan held hands and saluted the people of Modi | Eeroju news

అమరావతి జూన్ 12 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు టిడిపి, జనసేన కార్యకర్తల, జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరి సమక్షంలో ఎపి సిఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరితోపాటు కేబినెట్ మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్‌ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సంఘటన వేడుకకు హైలెట్ గా నిలిచింది.

Read More

చంద్రబాబు ప్రమాణస్వీకారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను… | Chandrababu’s oath taking I am Nara Chandrababu Naidu… | Eeroju news

అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజా గా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు. 2024లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచ లన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రి…

Read More

మెగాస్టార్.. పవర్ స్టార్.. మధ్యలో మోడీ.. | Megastar.. Power star.. Modi in the middle.. | Eeroju news

అమరావతి, కోన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన.. కార్యక్రమమం మొత్తంలో హైలెట్‌గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి..  మరో వైపు పవన్…

Read More