ఆదిమూలపు సురేష్ మిస్సింగ్ … ఒంగోలు, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని సీన్. 2019లో 151 సీట్లతో వైసీపీ విజయం సాధించాక.. ఐదేళ్లు పాటు మంత్రి పదవి అనుభవించిన ఆదిమూలపు సురేష్.. ఎక్కడంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించటంతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేసిన సురేష్.. కనిపించిన దాఖలాలు లేవంటూ సొంతనియోజకవర్గంలో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందటంతో తన మూలాలను కాపాడుకునేందుకు పోటీ చేసిన చోట కాకుండా.. పక్క నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.గత ఎన్నికల్లో సురేష్‌ను.. YCP అధిష్టానం యర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి బదిలీ చేసింది. ఆ నియోజకవర్గంంలో ఓటర్లు ఆయన్ను ఆదరించలేదు. 2009లో యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్…
Read More