Amaravati | 3 విభాగాలుగా అమరావతి | Eeroju news

3 విభాగాలుగా అమరావతి

3 విభాగాలుగా అమరావతి అమరావతి, అక్టోబరు 18, (న్యూస్ పల్స్) Amaravati అమరావతిలో నిర్మాణ పనులు పునః ప్రారంభించి పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన ఏడు అంశాల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. నిర్మాణాలు పునః ప్రారంభించిన తర్వాత అన్నింటికీ ఓ కాలపరిమితితో ముందుకెళ్లాలని నిర్ణయించారు.సీఆర్డీఏ చట్టం 2014 ప్రకారం అథారిటీ అకౌంట్స్‌ను ఏటా జులై 31లోగా అకౌంటెంట్ జ‌న‌ర‌ల్‌కు ఇవ్వాలి. 2014 నుంచి 2017 సంబంధించిన రిపోర్ట్‌ల‌ను 2018లోనే ఏజీకి స‌మ‌ర్పించారు. 2017-18 నుంచి ఆడిటింగ్ జ‌ర‌గ‌లేదు. 2017-18, 2018-19, 2019-20, 2020-21 ఆర్ధిక సంవ‌త్సరాల‌కు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ఏజీ ఇవ్వాలని తీర్మానం చేశారు. అమ‌రావ‌తి నిర్మాణంలో భాగంగా చేపట్టే నిర్మాణాలకు సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు అవ‌స‌రం అవుతాయి. కేంద్ర,రాష్ట్ర, స్థానిక సంస్థల నుంచి అనుమ‌తులు తీసుకోవాలి. ప్రపంచ బ్యాంకు,ఆసియా అభివృద్ది…

Read More