16 నుంచి ధనర్మాసం….సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై తిరుమల, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆరోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయని పేర్కొంది.ధనుర్మాస ఘడియాల నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారని టీటీడీ తాజా ప్రకటనలో వెల్లడించింది.. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ,…
Read More