హైదరాబాద్ ను మించిన రంగారెడ్డి హైదరాబాద్, జూలై 26, (న్యూస్ పల్స్) Ranga Reddy beyond Hyderabad ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యెుక్క ఆదాయాన్ని, జీవనస్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర బడ్జెట్ 2024-25 సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా.. తాజా గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు రూ.3,11,649గా వెల్లడించారు. అన్ని రకాల వస్తువులు, వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు. ఈ లెక్కింపు ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా…
Read More