హైడ్రా.. యాప్ రెడీ హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) HYDRA హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల విస్తీర్ణంపై సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నెలలలోపు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలు సేకరించి వెబ్ సైట్ లో వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సాయంత్రం తెలిపారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తుందని, అందులో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లు గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్…
Read More