హైడ్రాకు సూపర్ పవర్స్ హైద్రాబాద్, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Hydra హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రత్యేక జోవోను జారీచేసింది. పలు శాఖల అధికారాలను హైడ్రాకు బదిలీ చేయటంతో బాటు హైడ్రా కమిషనర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయపరమైన వివాదాలు రాకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, ట్రాఫిక్ సమన్వయం, అగ్నిమాపక సేవలు తదితరాలతో కూడిన బాధ్యతలన్నింటినీ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు అప్పగిస్తూ, ఒక ప్రత్యేక సంస్థను తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే హైడ్రా చట్టబద్ధతపై…
Read More