హరీష్ రావును కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హైదరాబాద్ Telangana తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బి.ఆర్. నాయుడు, మంగళవారం నాడు మాజీ మంత్రి హరీష్ రావు ను అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, హరీష్ రావు, నాయుడు కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన నాయుడు, , కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. టీటీడీ చైర్మన్గా నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన…
Read More