సజ్జలకు కీలక బాధ్యతలు దూరంగా సీనియర్ నేతలు విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Sajjala Ramakrishna Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ప్రకటించడం ఆ పార్టీలో కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో ఉంది. 2014లో గెలుస్తామనుకున్న వైసీపీ నేతలు ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ కష్టంలో మొదట జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంటే తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఆయన 2019 ఎన్నికలకు ముందు…
Read More