వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్ విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) YS Jagan వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పదకొండు మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని .. అది ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని వైసీపీ సభాపక్ష నేత జగన్ ప్రకటించారు. దాంతో అసెంబ్లీలో విపక్షం లేకుండా పోయింది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ ఉంది. బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. శాసనసభలో కాకకపోయినా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించిన ఆ పార్టీ క్యాడర్ కు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. శాసనమండలిలో వైసీపీకి పూర్తి మజార్టీ ఉంది. టీడీపీకి పది మంది ఎమ్మెల్సీలు ఉంటే.. వైసీపీకి 37 మంది ఉన్నారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందినవారే. ఇలాంటి…
Read More