విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత విశాఖపట్టణం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) AP శాఖలో నూనె వ్యాపారులు కృత్రిమ కొరత గేమ్ మొదలెట్టేశారు. నూనెల దిగుమతులపై 20 శాతం సుంకం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అది ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ డీలర్లు సిండికేట్‌గా మారిపోయి నూనె అమ్మకాల్ని రెండ్రోజుల పాటు నిలిపేసి కృత్రిమ డిమాండ్ సృష్టించేశారు. శని, ఆదివారాల్లో నూనె అమ్మకాలుండవంటూ చిరు వ్యాపారులకు వర్తమానం పంపించేశారు. అసలే వినాయక చవితి సంబరాల్లో భాగంగా చాలా చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులకు జెల్ల కొట్టేలా శనివారం తెల్లవారుజాము నుంచే వ్యాపారులు 30 శాతం ధరలు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రం ప్రకటించింది లూజ్ ఆయిల్‌పై.. అంటే ట్యాంకర్ల ద్వారా గుజరాత్, ముంబయి,…
Read More