విశాఖపట్నానికే ప్రాజెక్టు 77 విశాఖపట్టణం, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Visakhapatnam ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. విశాఖలో లులు మాల్, మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తామని లులు గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అటు టీసీఎస్ సైతం విశాఖపట్నానికి తరలిరానున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు విశాఖను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అణుశక్తితో దాడి చేయగలిగే రెండు జలాంతర్గాములను దేశీయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో పాటుగా 31 ఆయుధాలతో కూడిన MQ-9B ప్రిడేటర్ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.…
Read More