టీచర్ల కోసం వేడుకోలు.. ఏలూరు, జూలై 16, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాల కోసం తాము మట్టితో షెడ్‌ను నిర్మించుకున్నామని, ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ స్పందన కోసం ఆ గిరిజన గ్రామం ఎదురు చూస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంగల్ బంధ గ్రామంలో 28 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో మొత్తం 136 మంది జనాభా ఉన్నారు. వీరంతా కొండదొర ఆదివాసీ గిరిజనలు, వీరు కొండ చిట్టచివర జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. తెంగల్ బంధ గ్రామానికి చెందిన 26 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా గంగవరం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. అయితే రెండు వాగులు దాటుకొని, స్కూల్‌కి…
Read More