విజయనగరం, జూన్ 15, (న్యూస్ పల్స్) చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం. కానీ ఇప్పుడు మాత్రం ఆ జిల్లాను మహిళలు సమర్థవంతంగా పాలిస్తున్నారు. ఈ జిల్లాకు జిల్లా కలెక్టర్ గా జి.నాగలక్ష్మి ఉండగా, జిల్లా ఎస్పీగా ఎమ్. దీపిక పాటిల్ ఉన్నారు. వీరిద్దరి సమర్ధవంతమైన పాలనలో జిల్లా ఎన్నికలను ఒంటి చేత్తో…
Read More