విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్ విజయనగరం, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) Valmiki Research Center ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ఏర్పాటు చేస్తున్న వాల్మీకి రిసెర్చ్ సెంటర్ను జాతీయ సంస్కృత యూనివర్శిటి తో అనుసంధానం చేశారు నిర్వాహకులు. ఈ వాల్మీకి రిసెర్చ్ సెంటర్ టిటిడి సంస్కృత యూనివర్శిటి పర్యవేక్షణలో సాగుతుంది. ఇక్కడ టిటిడి సంస్కృత యూనివర్శిటికి చెందిన అధ్యాపకులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఈ రీసెర్చ్ సెంటర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంకు చెందిన నాలుగు భాషల రామాయణ గ్రంధాలు, రచనలు, పాఠ్యపుస్తకాలతో పాటు శ్రీరామునికి చెందిన ఇతర పుస్తకాలు కూడా…
Read More