బెజవాడలో భారీగా పెరుగుతున్న వరద విజయవాడ, ఆగస్టు 9(న్యూస్ పల్స్) Heavy rising flood in Bejwada క్రిష్ణా నదిలోకి వరద ప్రవాహం భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే జిల్లాలైన ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు…
Read MoreTag: వరద ప్రవాహం
Srisailam is like a full pot..Ten gates are lifted and water is released | నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల | Eeroju news
నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల శ్రీశైలం Srisailam is like a full pot..Ten gates are lifted and water is released ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం…
Read More