వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్ హైదరాబాద్, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Degree new syllabus తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఆరేళ్ల తర్వాత కొత్త పాఠ్య ప్రణాళికరానుంది. ఈ మేరకు డిగ్రీ సిలబస్‌ను సమీక్షించి ఇప్పటికి అవసరాలకు తగ్గట్లు మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజినీరింగ్ కోర్సులకు యూనివర్సిటీలు మూడేళ్లకోసారి రివిజన్ చేస్తుండగా, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మాత్రం ఎప్పటికప్పుడు మార్పులకు నోచుకోవడం లేదు. నామమాత్రంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, పరీక్షలు నిర్వహించి, పట్టాలిచ్చి పంపించేస్తున్నారు. దీంతో ఆయా డిగ్రీలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడక అవస్థలు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ సిలబస్‌ను మార్చేందుకు ఉన్నత విద్యామండలి కార్యచరన రూపొందించింది.తెలంగాణ రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్‌లో దాదాపు లక్ష మంది విద్యార్ధులు ప్రవేశాలు పొందుతున్నారు.…
Read More