ముఖ్యమంత్రులకు పరీక్షే న్యూఢిల్లీ, జూలై 11 (న్యూస్ పల్స్) A test for Chief Ministers వన్ నేషన్ – వన్ ఎలక్షన్” అమల్లోకి వచ్చే వరకు దేశంలో అనునిత్యం ఏదో ఒక మూల ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. యావత్ ప్రపంచం ఆసక్తిగా చూసిన లోక్‌సభ ఎన్నికలు ముగిసాయో లేదో.. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తారుమారు చేసే పరిస్థితి లేనప్పటికీ.. ఓ రెండు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యమంత్రులకు అగ్నిపరీక్షగా మారాయి. ఉప ఎన్నికల్లో ఆయా సీట్లు గెలుపొందితేనే ముఖ్యమంత్రి పదవి పదిలంగా ఉంటుంది. లేదంటే సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటూ పదవిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. బిహార్‌లోని రుపౌలి, మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్‌లోని డేహ్రా,…
Read More